పారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) ఆరంభవేడుకలకు ముందే కొన్ని పోటీలు ప్రారంభమైపోయాయి. వాటిలో ఆర్చరీ (Archery Team) కూడా ఒకటి… భారత్ (India ) పతకాలు ఆశలు పెట్టుకున్న ఆర్చరీలో మన జట్లు శుభారంభం చేశాయి. మహిళల జట్టు క్వార్టర్స్ చేరితే పురుషుల జట్టు కూడా ముందంజ వేసింది. బెజవాడ కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ (Dhiraj ) అదరగొట్టిన వేళ పురుషల ఆర్చరీలో భారత్ సత్తా చాటింది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో బొమ్మదేవర ధీరజ్, తరుణ్ దీప్, ప్రవీణ్ త్రయం సమిష్టిగా రాణించారు. ముఖ్యంగా విజయవాడకు చెందిన బొమ్మదేవర ధీరజ్‌సంచలన ప్రదర్శనతో మెరిశాడు. దీంతో మెన్స్ టీమ్ ఈవెంట్ లో క్వార్టర్ ఫైనల్ చేరడంతో పాటు మిక్సిడ్ టీమ్ ఈవెంట్ లోనూ ప్రీ క్వార్టర్స్ లో అడుగుపెట్టింది. టీమ్ ఈవెంట్ లో ధీరజ్‌తో పాటు తరుణ్‌దీప్, ప్రవీణ్ సత్తాచాటడంతో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో భారత్ బృందం 2013 పాయింట్ల సాధించింది . ఇక వ్యక్తిగత విభాగంలో ధీరజ్ 681 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. తరుణ్‌దీప్ 674 పాయింట్లతో 14 స్థానంలో, ప్రవీణ్ 658 పాయింట్లతో 39వ స్థానంలో నిలిచారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ ఈవెంట్ లో ధీరజ్ ప్రదర్శన అద్భుతమనే చెప్పాలి. ఒకదశలో టాప్ 10 అవతల ఉన్న ధీరజ్ అనూహ్యంగా ముందుకు దూసుకొచ్చాడు. వరుస పాయింట్లతో ప్రత్యర్థులను దాటేశాడు. గత కొంతకాలంగా ఆర్చరీలో ఈ బెజవాడ్ కుర్రాడు నిలకడగా రాణిస్తున్నాడు. మరోవైపు మహిళల జట్టు విభాగంలోనూ భారత్ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. అంకిత భకత్ అద్భుత ప్రదర్శనతో ఇండియా టాప్-4కు చేరింది. భజన కౌర్, దీపిక కుమారి కూడా సత్తాచాటారు. ఈ ముగ్గురమ్మాయిలు కలిసి 1983 పాయింట్లు సాధించారు. క్వార్టర్ ఫైనల్‌లో భారత్ మహిళల ఆర్చరీ జట్టు ఫ్రాన్స్ వర్సెస్ నెదర్లాండ్స్ విజేతతో తలపడాల్సి ఉంటుంది.
Read Also : Free Schemes : ఉచిత పథకాలతో భవిష్యత్ తరాలపై భారం మోపవద్దు – నిర్మలా సీతారామన్
