R Ashwin: అశ్విన్ ను పక్కనపెట్టడంపై ఫ్యాన్స్ ఫైర్

ఇంగ్లాండ్ గడ్డపై నాలుగోసారి టెస్ట్ సిరీస్ గెలవాలనుకున్న టీమిండియా కల నెరవేరలేదు.

  • Written By:
  • Publish Date - July 5, 2022 / 04:27 PM IST

ఇంగ్లాండ్ గడ్డపై నాలుగోసారి టెస్ట్ సిరీస్ గెలవాలనుకున్న టీమిండియా కల నెరవేరలేదు. తొలి మూడు రోజులూ చక్కని ఆధిపత్య కనబరిచిన భారత్ నాలుగోరోజు మాత్రం చేతులెత్తేసింది. బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో పరాజయం తప్పలేదు. ఫలితం సిరీస్ సమంగా ముగిసింది. మూడురోజుల ఆట ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ ఓటమో , మ్యాచ్ డ్రాగా ముగుస్తుందనో చాలా మంది భావించారు. అయితే మరోసారి ఇంగ్లీష్ బ్యాటర్లు రెచ్చిపోయిన వేళ 378 పరుగుల టార్గెట్ ను అలవోకగా ఛేదించింది. ఇదిలా ఉంటే భారత్ ఓటమికి జట్టు కూర్పే కారణమని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను బెంచ్‌కు పరిమితం చేయడంపై మండిపడుతున్నారు.

రవిచంద్రన్ అశ్విన్ ప్రస్తుతం టెస్టుల్లో రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. అంతేకాకుండా సుదీర్ఘ ఫార్మాట్‌కు సంబంధించి ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లోనూ రెండో స్థానంలో ఉన్నాడు. అయినప్పటికీ అతడికి తుది జట్టులోకి తీసుకోకపోవడంతో ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఈ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అశ్విన్‌కు ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం కల్పించలేదు. ఇంగ్లీష్ ప్లేయర్ జానీ బెయిర్‌స్టో మెచ్యురిటీతో ఆడుతున్నాడు. అశ్విన్ లాంటి ట్రిక్కీ స్పిన్నర్‌ను ఇండియా దూరం చేసుకుంది అని అభిమానులు జట్టు మేనేజ్మెంట్‌ను విమర్శిస్తున్నారు. కోహ్లీ, అయ్యర్ ఇద్దరూ కలిపి రెండు ఇన్నింగ్స్‌ల్లో 96 పరుగుల చేశారు. అదే అశ్విన్ ఉన్నట్లయితే వికెట్ సహా ఆ పరుగులు కూడా చేసి ఉండేవాడని ఒకరు స్పందించగా.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో అశ్విన్‌ను ఆడించాల్సింది. స్కోరు చేయడమే కాకుండా వికెట్లు కూడా తీసేవాడంటూ కొందరు ట్వీట్లు చేశారు. నాణ్యమైన స్పిన్నర్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని చెబుతున్నారు.