Asia Cup 2023: ఆసియా కప్ 2023 కోసం భారత జట్టును ఆగస్టు 21న ప్రకటించే అవకాశం ఉంది. జట్టులోకి కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లకు చోటు దక్కుతుందా లేదా అనేది ఉత్కంఠగా మిగిలిపోయింది. NCA నివేదికల ప్రకారం, రాహుల్ ఫిట్‌గా మారాడు మరియు శ్రేయాస్ అయ్యర్ కూడా ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. .
టీమిండియాకు వరుస గాయాల సమస్య తలెత్తుతుంది. ఈ మేరకు బలమైన జట్టుని తయారు చేసే క్రమంలో ఈ సారి 15 మంది ఆటగాళ్లకు బదులు 17 మందితో కూడిన జట్టును ఆసియా కప్‌కు ఎంపిక చేస్తారు.ఈ జట్టులో కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్‌లకు స్థానం లభించినప్పటికీ వారి ఫిట్‌నెస్‌పై తుది ఎంపిక ఉంటుంది. ఆసియా కప్ 2023కి ఎంపికయ్యే 17 మంది సభ్యుల్లో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ ఓపెనింగ్ జోడీగా ఎంపికయ్యారు.
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్, ఇషాన్ కిషన్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, యుజ్వేంద్ర చాహల్ , ఆర్ అశ్విన్ ఉన్నారు.
Also Read: DRDO Drone: పొలాల్లో కుప్పకూలిన డిఆర్డివో డ్రోన్.. అసలేం జరిగిందంటే?