INDIA Kabaddi Team: ఆసియా క్రీడలు 2023లో పురుషుల కబడ్డీ ఈవెంట్‌లో భారత జట్టు (INDIA Kabaddi Team) ఫైనల్‌కు చేరుకుంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 61-14 తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో 2023 ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో రజత పతకం ఖాయమైంది. ఈ మ్యాచ్ ఆరంభం భారత్‌కు కాస్త కష్టంగానే ప్రారంభం అయింది. ఆరంభంలోనే పాక్ నాలుగు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. అయితే ఆ తర్వాత భారత రైడర్లు, డిఫెండర్లు దూకుడు పెంచడంతో కొద్ది నిమిషాల్లోనే మ్యాచ్‌ను పాక్ చేతుల్లోంచి చేజార్చుకున్నారు. సగం సమయానికి భారత్ మూడుసార్లు పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసి ఆధిక్యాన్ని 30-5కి పెంచుకుంది.
రెండో అర్ధభాగంలోనూ భారత ఆటగాళ్ల దూకుడు కొనసాగింది. ఈ అర్ధభాగంలో భారత్ మరో మూడుసార్లు పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసింది. అంటే మొత్తం మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు 6 సార్లు ఆలౌట్ అయింది. కాగా భారత జట్టు ఒక్కసారి కూడా ఆలౌట్ కాలేదు.
Also Read: Kushboo Support to Roja : మంత్రి రోజా కు సపోర్ట్ గా నిలిచిన సీనియర్ నటి
We’re now on WhatsApp. Click to Join
ఫైనల్‌లో ఇరాన్‌తో తలపడే అవకాశం ఉంది
భారత్ సాధించిన ఈ అద్భుత విజయం తర్వాత కబడ్డీ అభిమానులు సోషల్ మీడియాలో భారత ఆటగాళ్లపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కబడ్డీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజయం కోసం భారత అభిమానులు కూడా ప్రార్థనలు ప్రారంభించారు. కబడ్డీ రెండో సెమీఫైనల్ ఇరాన్- చైనీస్ తైపీ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో విజేతతో భారత జట్టు స్వర్ణ పతక పోరులో తలపడనుంది. భారతదేశం.. ఇరాన్‌తో పోటీపడే అవకాశాలు ఎక్కువ. కబడ్డీలో ఇరాన్‌కు అనుభవం ఉంది. గత ఆసియా క్రీడల్లో ఇరాన్ ఛాంపియన్ గా నిలిచింది.