Shahid Afridi: ఐసీసీపై అఫ్రిది సంచలన వ్యాఖ్యలు..!

ఐసీసీ అండతోనే ఈ ప్రపంచకప్ లో టీమిండియా విజయాలు సాధించిందని ఆరోపించాడు.

Published By: HashtagU Telugu Desk
Shahid Afridi Dead

Shahid Afridi Dead

ప్రపంచ క్రికెట్ లో భారత్ మీద విమర్శలు చేస్తూ ఏడ్చేది ఎవరైనా ఉన్నారంటే అది పాక్ మాజీ క్రికెటర్లే. ముఖ్యంగా ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీల్లో ఆ జట్టుపై మనకు ఉన్న తిరుగులేని రికార్డు వారు జీర్ణించుకోలేరు. దీనికి తోడు ఓడిపోయిన ప్రతీసారీ ఏదో ఒకటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటారు. ఈ సారి ఒక అడుగు ముందుకేసి ఐసీసీ, భారత్ జట్లను టార్గెట్ చేసారు. తాజాగా పాక్ మాజీ ప్లేయర్ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఐసీసీ అండతోనే ఈ ప్రపంచకప్ లో టీమిండియా విజయాలు సాధించిందని ఆరోపించాడు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లను చూస్తే ఈ విషయం అర్థమవుతుందన్నాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో ఐసీసీ ఒత్తిడితోనే ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉన్నా.. అంపైర్లు మ్యాచ్ నిర్వహించారని చెప్పాడు. భారత్‌ను ఎలాగైన సెమీస్ ఆడించాలనే ఉద్దేశంతోనే ఐసీసీ ఇలా వ్యవహరించిందన్నాడు. మరోవైపు అఫ్రిది వ్యాఖ్యలపై భారత మాజీలు, ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.

అవకాశం దొరికినప్పుడల్లా భారత్‌పై అక్కసు వెళ్లగక్కే అఫ్రిది.. టీ20 ప్రపంచకప్‌ 2022లో రోహిత్ సేన విజయాలను ఓర్వలేక ఈ ఆరోపణలు చేస్తున్నాడని అభిమానులు మండిపడుతున్నారు. నిజానికి బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో భారత్ గెలవడంతో పాక్ సెమీస్ అవకాశాలు దెబ్బతిన్నాయి. ఈ కారణంగానే పాక్ మాజీ అక్కసు వెళ్ళగక్కుతున్నారు. అటు జింబాబ్వే లాంటి చిన్న జట్టు చేతిలో ఓడిపోయి ఇతర జట్ల మీద విమర్శలు చేయడం ఎందుకని పలువురు అఫ్రిదిని ప్రశ్నిస్తున్నారు.

  Last Updated: 05 Nov 2022, 10:26 AM IST