Site icon HashtagU Telugu

India 4th@CWG: మెడల్స్ తగ్గినా ప్రదర్శన అద్భుతమే

Cwggold Imresizer

Cwggold Imresizer

కామన్‌వెల్త్ గేమ్స్ ముగిసాయి.. అంచనాలకు తగ్గట్టే భారత్ ప్రదర్శన ఉన్నప్పటకీ గతంతో పోలిస్తే పతకాల సంఖ్య తగ్గింది. బాక్సర్లు, రెజ్లర్లు, షట్లర్లతో పాటు అథ్లెటిక్స్‌లోనూ అద్భుతంగా రాణించినా మెడల్స్‌ తగ్గడానికి కారణం మనకు సత్తా ఉన్న షూటింగ్ ఈసారి బర్మింగ్‌హామ్‌ గేమ్స్‌లో లేకపోవడమే.
ఈ భారీ అంచనాల మధ్య గతంలో ఎన్నడూ లేనంతా పెద్ద బృందం సారి కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో అడుగుపెట్టింది. గతంతో పోలిస్తే ఈ సారి పతకాల సంఖ్య మరింత మెరుగవుతుందని ఆశించినప్పటకీ ఓవరాల్‌గా మన ప్రదర్శనను తక్కువ చేయలేం. ఎందుకంటే చాలా ఈవెంట్లలో అంచనాలకు మించి మన క్రీడాకారుల ప్రదర్శన సాగింది. ముఖ్యంగా అథ్లెటిక్స్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా మెడల్స్ వచ్చాయి. ట్రిపుల్ జంప్, లాంగ్ జంప్, హై
జంప్‌లలో భారత్ అదరగొట్టింది. జావెలిన్ త్రోలో నీరజ్ లేకపోవడం మైనస్ అయినప్పటకీ.. మహిళల విభాగంలో తొలిసారి జావెలిన్ త్రోలో పతకం వచ్చింది. మొత్తం 12 క్రీడాంశాల్లో మన దేశం పతకాలు సాధించింది. ఊహించినట్టుగానే బాక్సింగ్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్‌లో పసిడి పతకాల మోగించారు. క్రికెట్, హాకీల్లో స్వర్ణాలు తృటిలో చేజారడం నిరాశ కలిగించినా ఓవరాల్‌గా మాత్రం భారత్ మంచి ప్రదర్శనే కనబరిచింది. చివరిరోజు స్వర్ణాల సంఖ్య పెరిగినప్పటకీ.. ఓవరాల్‌గా మన టీమ్ 61 పతకాలతో గేమ్స్‌ను ముగించింది. నాలుగో స్థానంలో నిలిచిన భారత్ ఇప్పటి వరకూ అత్యత్తమ ప్రదర్శన^2010 సొంతగడ్డపై జరిగిన కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో అత్యధికంగా 101 పతకాలు గెలిచింది. వీటిలో 38 స్వర్ణాలున్నాయి. తర్వాత 2002 మాంచెస్టర్‌లో 69 , 2018 గోల్డ్‌కోస్ట్‌లో 66 , 2014 గ్లాస్గో గేమ్స్‌లో 64 పతకాలు గెలిచింది. తాజాగా బర్మింగ్‌హామ్ వేదికగా 61 పతకాలు గెలవడం ద్వారా ఐదో బెస్ట్ పెర్మార్మెన్స్‌గా నమోదైంది. అయితే 2018 కంటే ఐదు పతకాలు తక్కువగా రావడానికి ప్రధాన కారణం భారత్‌ అద్భుతంగా రాణించే షూటింగ్ ఈ సారి లేదు. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ జాబితా నుంచి షూటింగ్‌ను తొలగించడం మనకు ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. షూటింగ్ ఉండి ఉంటే కనీసం 6 నుంచి 10 పతకాలు ఖచ్చితంగా వచ్చేవన్నది విశ్లేషకులు అంచనా. ఈ సారి గేమ్స్‌లో అంచనాలు పెట్టుకున్న వారంతా వాటిని నిలబెట్టుకున్నారని మాత్రం చెప్పొచ్చు. రెజ్లర్లు మొత్తం 10 మెడల్స్ గెలిస్తే…వెయిట్ లిఫ్టింగ్‌లో 10 వచ్చాయి. టేబుల్ టెన్నిస్‌లో మొత్తం 7 గెలిస్తే అందులో 4 స్వర్ణాలున్నాయి. ఎవ్వరూ ఊహించని విధంగా లాన్ బౌల్స్‌లోనూ మెడల్ సాధించి భారత్ చరిత్ర సృష్టించింది.

Exit mobile version