Site icon HashtagU Telugu

Asia Cup: భారత ఫీల్డింగ్ తప్పిదాలు.. పాకిస్థాన్ మెరుగైన లక్ష్యంతో మైదానంలోకి

India

India

 దుబాయ్, యూఏఈ: Asia Cup 2025- ఆసియా కప్ 2025 సూపర్ 4 దశలో దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ ఫీల్డింగ్‌లో చేసిన పొరపాట్లు పాకిస్థాన్‌కు కలిసొచ్చాయి. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా, పాకిస్థాన్ బ్యాటర్లు మొదట తడబడినా తరువాత పుంజుకున్నారు.

ఇన్నింగ్స్ మూడో ఓవర్లో పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఫకర్ జమాన్ (15) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఫర్హాన్ ధాటిగా ఆడుతూ మ్యాచ్ మోమెంటం మార్చేశాడు. జస్‌ప్రీత్ బుమ్రాకు సిక్సర్లతో సమాధానం ఇస్తూ పాక్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 10.2 ఓవర్లలో పాక్ స్కోరు 93/1కు చేరడంతో 200 పరుగుల దిశగా వెళ్తుందనే ఊహలు వచ్చాయి.

ఈ దశలో శివమ్ దూబే వరుస ఓవర్లలో వికెట్లు తీసి భారత్‌కు ఊపునిచ్చాడు. అయితే ఫీల్డింగ్ విఫలమైనా పాక్ బ్యాటర్లను నిలబెట్టింది. ఫర్హాన్‌కు రెండు అవకాశాలు లభించాయి. ఒకసారి పరుగుల ఖాతా తెరవకముందే, తర్వాత మరోసారి – రెండుసార్లు కూడా అతడి క్యాచ్‌ను అభిషేక్ శర్మ వదిలేశాడు. ఈ అవకాశాలను క్యాష్ చేసుకున్న ఫర్హాన్ 45 బంతుల్లో 58 పరుగులు చేశాడు.

చివర్లో ఫహీమ్ అష్రప్ 8 బంతుల్లో 20 పరుగులు కొట్టి స్కోరును పుళ్లించాడు. చివరకు పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. భారత్ ముందూ పోరాడాల్సిన గట్టి లక్ష్యాన్ని ఉంచింది.

భారత బౌలింగ్ పరంగా శివమ్ దూబే రెండు వికెట్లు తీయగా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీసారు. జస్‌ప్రీత్ బుమ్రా మాత్రం నాలుగు ఓవర్లు వేసి 45 పరుగులు ఇచ్చి, వికెట్ మాత్రం తీయలేకపోయాడు.

Exit mobile version