Site icon HashtagU Telugu

Ind Beat Bangladesh: బంగ్లాదేశ్‌పై భారత్ విజయం, ఆసియా కప్ ఫైనల్‌లో చోటు

India vs Sri Lanka

India vs Sri Lanka

India Beat Bangladesh: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం జరిగిన ఆసియా కప్ 2025 సూపర్-4 మ్యాచ్‌లో భారత్ బంగ్లాదేశ్‌ను 41 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించింది.

ముందుగా టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోగా, భారత్ బ్యాటింగ్‌కు దిగింది. టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆయన 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు కొట్టాడు. హార్దిక్ పాండ్యా 29 బంతుల్లో 38 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేకపోయారు.

169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ జట్టు 19.2 ఓవర్లలో 127 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ సైఫ్ హసన్ ఒక్కరే పోరాడి 69 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. 9 మంది డబుల్ డిజిట్ స్కోరు అందుకోలేకపోయారు.

భారత బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీసి కీలకంగా నిలిచాడు. అతను తంజీమ్ హసన్ సాకిబ్, రిషాద్ హుస్సేన్‌ను బ్యాక్ టు బ్యాక్ బంతుల్లో ఔట్ చేశాడు. జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు తీశారు. వరుణ్, షమీమ్ హుస్సేన్, సైఫుద్దీన్‌ను ఔట్ చేశాడు. బుమ్రా తంజిద్ హసన్‌ను 1 పరుగుకే ఔట్ చేశాడు. అక్షర్ పటేల్ తౌహీద్ హృదోయ్‌ను ఔట్ చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ డైరెక్ట్ త్రోతో జకీర్ అలీను రనౌట్ చేశాడు. చివరి వికెట్ తిలక్ వర్మ తీసి మ్యాచ్ ముగించాడు.

ఈ విజయం తర్వాత టీం ఇండియా ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుంది.

Exit mobile version