IND vs ENG 3rd Test: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ ల టీమిండియా హిస్టారికల్ విజయాన్ని సొంతం చేసుకుంది. 5 టెస్టుల సిరీస్ లో భాగంగా మూడో టెస్టులో టీమిండియా 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పై విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక విజయంతో ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి ఇంగ్లండ్‌ను ఏకపక్షంగా ఓడించింది. ఐదో రోజు ఈ మ్యాచ్ ముగుస్తుందేమో అనిపించినా టీమ్ ఇండియా అద్భుతమైన బౌలింగ్‌కి ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ నిలబడలేక 557 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 122 పరుగులకే ఆలౌటైంది. టెస్టు క్రికెట్‌లో ఈ విజయం టీమిండియాకు అతిపెద్ద విజయం.
557 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ జట్టు 15 పరుగుల వద్ద తొలి వికెట్ చేజార్చుకుంది. దాంతో ఇంగ్లాండ్ బ్యాటర్ల పతనం వేగంగా కొనసాగింది. ఈ మ్యాచ్‌లో సెంచరీ నమోదు చేసిన డకెట్‌ను కీపర్ ధ్రువ్ జురెల్ రనౌట్ చేశాడు. జాక్ క్రాలేను బుమ్రా అవుట్ చేశాడు. దీంతో 18 పరుగుల వద్ద ఇంగ్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. 28 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ వందలోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. కానీ మార్క్ వుడ్ 33 పరుగులతో పర్వాలేదనిపించడంతో 122 పరుగులకు బ్రిటీష్ జట్టు ఆలౌట్ అయింది.
ఇంగ్లండ్‌పై టెస్టు క్రికెట్‌లో భారత్ ఇప్పటి వరకు అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇంతకుముందు 2021 సంవత్సరంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా 372 పరుగులతో గెలిచింది. ఆ విజయం టీమ్ ఇండియాకు అతిపెద్ద విజయం. కాగా టెస్టు క్రికెట్‌లో ఇది 8వ అతిపెద్ద విజయం. ఈ జాబితాలో ఇంగ్లండ్ జట్టు మొదటి స్థానంలో ఉంది. 1928లో ఆస్ట్రేలియాను 675 పరుగుల తేడాతో ఓడించింది.
Also Read: IT Raids: లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ నేతపై ఐటీ రైడ్స్