Site icon HashtagU Telugu

Thomas Cup:థామస్ కప్ మనదే..ఫైనల్స్ చిరాగ్, సాయిరాజ్ జోడి విజయం..!!

Thomas Cup I

Thomas Cup

థామస్ కప్ టోర్నీ భారత్ ను వరించింది. డబుల్స్ టైటిల్స్ లో ఫైనల్ చేరిన భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాక్ శెట్టి టైటిల్ పోరులో సత్తా చూపించారు. ఇండోనేషియాకు చెందిన అసాన్ సంజయ జోడిపై విజయం సాధించారు. మూడు సెట్ల పాటు సాగిన టైటిల్ వేటలో సాత్విక్, చిరాగ్ జోడి 18-21, 23-21, 21-19తో గెలిచారు. మొదటిసెట్ ను ఓడి డిఫెన్స్ పడిపోయినట్లుగా కనిపించిన సాయిరాజ్, చిరాగ్ ల జోడి వెంటనే ఫాంలోకి వచ్చారు. మొదటి సెట్ తర్వాత రెండు మూడు సెట్లను వరుసగా నెగ్గింది.

కాగా థామస్ కప్ చరిత్రలో మొదటిసారి ఫైల్ చేరిన భారత జోడిగా ఇప్పటికే సాయిరాజ్, చిరాగ్ ల జోడి రికార్డు క్రియేట్ చేసింది. అయితే ఫైనల్లో వీరు పోటీ పడాల్సిన ఇండోనేషియా జట్టు మాత్రం అప్పటికే 14 టైటిళ్లు గెలించి స్ట్రాంగ్ గా ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఫైనల్లో ఏదో అద్భుతం జరిగితే కానీ…భారత్ కు టైటిల్ దక్కదన్న వాదనలు వినిపించినా….ఈ వాదనలకు చెక్ పెట్టిన సాయిరాజ్, చిరాగ్ జోడి భారత్ కు థామస్ కప్ లో తొలి టైటిల్ ను అందించారు.