Site icon HashtagU Telugu

IND Collapse : కేప్ టౌన్ టెస్టులో వికెట్ల జాతర..భారత్ 153 ఆలౌట్

India Allout

India Allout

భారత్, దక్షిణాఫ్రికా (India vs South Africa) మధ్య కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు (2nd Test)లో తొలిరోజు బౌలర్ల హవా నడిచింది. పేస్ పిచ్ పై పరుగులు చేసేందుకు బ్యాటర్లు తంటాలు పడగా… పేసర్లు వికెట్ల పండుగ చేసుకున్నారు. ఫలితంగా మూడు సెషన్లలోపే రెండు ఇన్నింగ్స్ లు ముగిసాయి. మొదట సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలగా… తర్వాత నిలకడగా ఆడినట్టు కనిపించిన టీమిండియా కూడా 153 పరుగులకే ఆలౌటైంది (153 All Out ). సఫారీలను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన ఉత్సాహంలో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ (India) 17 పరుగులకే జైశ్వాల్ వికెట్ కోల్పోయింది. అయితే శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ రెండో వికెట్ కు 55 పరుగులు జోడించారు. అయితే లంచ్ తర్వాత పుంజుకున్న సఫారీ పేసర్లు వరుస వికెట్లతో భారత్ ను కట్టడి చేశారు. రోహిత్ 39, గిల్ 36 పరుగులకు ఔటవగా.. తర్వాత కోహ్లీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ విరాట్ కు సహచరుల నుంచి సహకారం దక్కలేదు. రాహుల్ 8 రన్స్ కే ఔటవగా.., శ్రేయాస్ అయ్యర్ , జడేజా ఇద్దరూ డకౌటయ్యారు.

We’re now on WhatsApp. Click to Join.

టెయిలెండర్లను ఔట్ చేసేందుకు సఫారీ బౌలర్లకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆశ్చర్యమేమిటంటే భారత్ చివరి 6 వికెట్లను ఒక్క పరుగు కూడా చేయకుండానే కోల్పోయింది. 153 పరుగుల దగ్గర కేఎల్ రాహుల్ వెనుదిరిగిన తర్వాత మిగిలిన బ్యాటర్లు కనీసం ఒక్క పరుగు కూడా చేయలేదు. ఐదుగురు బ్యాటర్లు డకౌటవగా.. ఒంటరి పోరాటం చేసిన కోహ్లీ 46 రన్స్ చేసి చివరి వికెట్ గా వెనుదిరిగాడు. ఫలితంగా భారత్ 153 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ సేనకు 98 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. సఫారీ బౌలర్లలో రబాడ 3, ఎంగిడి 3 , బర్గర్ 3 వికెట్లు పడగొట్టారు. కాగా రెండో ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికాను ఎంత త్వరగా ఔట్ చేస్తారనే దానిపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. కేప్ టౌన్ పిచ్ పూర్తిగా పేసర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో మ్యాచ్ ఐదు రోజులు కొనసాగే అవకాశాలు లేవనే చెప్పాలి.

Read Also : Virat Kohli: జంగ్‌కుక్‌ను అధిగమించిన కోహ్లీ