Site icon HashtagU Telugu

Ind Vs Zim 2nd ODI 1st Innings: టీంఇండియా దెబ్బకు జింబాబ్వే ఆల్ ఔట్..

India vs West Indies

India Vs Wi Imresizer

కొత్త బంతితో దీపక్ చాహర్ అద్భుతంగా రాణించాడు. ఫలితంగా 10 వికెట్ల విజయాన్ని నమోదు చేసింది. శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్ 190 పరుగుల లక్ష్యాన్ని కేవలం 30.5 ఓవర్లలోనే పూర్తి చేయడంతో టీమ్ ఇండియా జింబాబ్వేతో సిరీస్‌లో ఓపెనింగ్ మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఈ సిరీస్‌లోని కీలక మ్యాచ్ రెండో వన్డేల్లోనూ అదే జోరును కొనసాగించాలని టీమ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. అయితే కీలక ఆసియా కప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్‌ ఎలా ఆడుతాడనే అందరూ ఎదురు చూస్తుండగా.. అతను మాత్రం అందరికీ షాకిచ్చాడు.

ఓపెనర్‌గా వస్తాడనుకున్న రాహుల్.. ధావన్‌కు తోడుగా శుభ్‌మన్ గిల్‌ను పంపించాడు. దాంతో అభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకులు సైతం నివ్వెరపోయారు. జింబాబ్వే తో రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ గెలుచుకోవడానికి బరిలో దిగింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వేను కేవలం 30 ఓవర్లలోనే 161 పరుగులకు ఆల్ ఔట్ చేసింది. ప్రస్తుతం ఇండియా బ్యాటింగ్ మొదలుపెట్టింది. 1 వికెట్ నష్టానికి 47 పరుగులు సాధించింది.