Site icon HashtagU Telugu

Australia: ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌట్‌.. 11 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు..!

Australia

Resizeimagesize (1280 X 720) 11zon

భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా (Australia) 197 పరుగులకు ఆలౌటైంది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో 88 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. టీమిండియా తన ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 109 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 197 పరుగులకు కుప్పకూలింది. అశ్విన్ 3 వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్ కూడా 3 వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా 88 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. జడేజాకు నాలుగు వికెట్లు దక్కాయి. ఈ మ్యాచ్‌లో పునరాగమనం చేసేందుకు భారత్‌కు ఇప్పుడు మంచి అవకాశం లభించింది.

4 వికెట్ల నష్టానికి 156 పరుగులతో రెండో రోజు ఉదయం ఆట ప్రారంభించిన ఆసీస్ మరో 41 పరుగులు జోడించి ఆరు వికెట్లను చేజార్చుకుంది. రెండో రోజు ఉదయం ఆట ఆరంభమయ్యాక ఆస్ట్రేలియా బ్యాటర్లు పీటర్ హ్యాండ్స్‌కాంబ్ (98 బంతుల్లో 19), కామెరాన్ గ్రీన్ (57 బంతుల్లో 21) పట్టుదలతో బ్యాటింగ్ చేశారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 40 పరుగులు జోడించారు.

Also Read: Mumbai Indians: ముంబై ఇండియన్స్‌కు గుడ్ న్యూస్.. బుమ్రా లేకుంటే.. ఆర్చర్ ఉన్నాడుగా..!

హ్యాండ్స్‌కాంబ్‌ను ఔట్ చేసిన అశ్విన్.. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడదీశాడు. తర్వాతి ఓవర్లోనే గ్రీన్‌ను ఉమేశ్ యాదవ్ ఎల్బీగా ఔట్ చేశాడు. బ్యాటర్లంతా పెవిలియన్ చేరడంతో టెయిలెండర్లను అశ్విన్, ఉమేశ్ స్వల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేర్చారు. దీంతో ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌటయ్యింది. అశ్విన్, ఉమేశ్ దెబ్బకు ఆస్ట్రేలియా తన చివరి 6 వికెట్లను 11 పరుగుల వ్యవధిలో కోల్పోవడం గమనార్హం. భారత బౌలర్లలో రవీంద్ర జడేజాకు 4 వికెట్లు దక్కగా.. అశ్విన్, ఉమేశ్ యాదవ్‌ తలో 3 వికెట్లు తీశారు. ఆసీస్ బ్యాటర్లలో ఉస్మాన్ ఖవాజా 60 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బుధవారం రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు పడగొట్టాడు. ట్రావిస్ హెడ్ (9), ఉస్మాన్ ఖవాజా (60), మార్నస్ లబుషెన్ (31), స్టీవ్ స్మిత్ (26)లను అవుట్ చేశాడు.