India Become World No. 1 in Cricket: మేమే నెంబర్ 1..

ఎందులోనైనా నెంబర్ వన్ ర్యాంక్ అంటే ప్రత్యేకమే.. క్రికెట్‌లో (Cricket) మూడు ఫార్మాట్లలో

  • Written By:
  • Publish Date - February 15, 2023 / 07:44 PM IST

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ (India) హవా..

ఎందులోనైనా నెంబర్ వన్ ర్యాంక్ అంటే ప్రత్యేకమే.. క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో అగ్రస్థానంలో నిలిస్తే అంతకంటే రికార్డు ఏముంటుంది.. ప్రస్తుతం ఇలాంటి అరుదైన ఘనత సాధించింది టీమిండియా (Team India).. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టెస్ట్ , వన్డే, టీ ట్వంటీల్లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా దేశంగా చరిత్ర సృష్టించింది.

ఈ ఏడాది ఆరంభం నుంచీ వన్డే , టీ ట్వంటీల్లో భారత్ (India) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు టెస్టుల్లో రెండో స్థానంలో ఉంది. నాగ్‌పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియాను చిత్తు చేయడంతో 4 రేటింగ్ పాయింట్లను సాధించి టాప్ ప్లేస్‌కు దూసుకెళ్ళింది. ఇన్నింగ్స్ ఓటమి చవిచూసిన ఆసీస్ రెండో స్థానానికి పడిపోయింది. ఈ సిరీస్‌ను టీమిండియా 3-0తో గెలిస్తే నెంబర్ వన్ ర్యాంకును మరింత పటిష్టం చేసుకుంటుంది. మూడు ఫార్మేట్లలో ఒకేసారి టాప్ ర్యాంక్ సాధించిన రెండో జట్టుగా రోహిత్‌సేన ఘనత సాధించింది. గతంలో సౌతాఫ్రికా మాత్రమే ఈ ఫీట్ అందుకుంది. అయితే ఈ ఘనత సాధించిన తొలి ఆసియా జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ మూడో స్థానంలోనూ, న్యూజిలాండ్, సౌతాఫ్రికా 4,5 స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే ఆసీస్‌పై టెస్ట్ సిరీస్ గెలిస్తే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌కు కూడా భారత్ క్వాలిఫై అవుతుంది.

మరోవైపు వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లోనూ టీమిండియా క్రికెటర్లు ఆధిపత్యం కనబరిచారు. ప్రస్తుతం ఐసీసీ ఆల్‌రౌండర్‌ ర్యాంకింగ్స్‌లో టెస్ట్ ఫార్మాట్‌కు సంబంధించి రవీంద్ర జడేజా అగ్రస్థానంలో నిలిచాడు. గాయం నుంచి కోలుకుని చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన జడ్డూ నాగ్‌పూర్‌ టెస్టులో అదరగొట్టాడు. బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించడంతో టెస్టుల్లో నెంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా దూసుకొచ్చాడు. అటు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో ర్యాంకులో నిలిచాడు. నాగ్‌పూర్ టెస్టులో అశ్విన్ 8 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్ విభాగంలో భారత కెప్టెన్ రోహిత్‌శర్మ 8వ ర్యాంకుకు మెరుగయ్యాడు.

కాగా వరల్డ్ క్రికెట్‌లో ప్రస్తుతం టీమిండియా డామినేషన్ కనిపిస్తోంది.మూడు ఫార్మాట్లలోనూ నెంబర్ వన్‌గా నిలవడమే కాకుండా వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లోనూ, టీ ట్వంటీ బ్యాటర్ ర్యాంకింగ్స్‌లోనూ కూడా మన ఆటగాళ్ళే టాప్ ప్లేస్‌లో ఉన్నారు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ వన్డేల్లో నెంబర్ వన్ బౌలర్‌గా ఉంటే… టీ ట్వంటీ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ గత ఏడాది చివరి నుంచీ టాప్ ర్యాంకులో కొనసాగుతున్నాడు.

Also Read:  Bad Smell From Mouth: మీకు నోటి దుర్వాసన బాగా వస్తుందా.. ఇలా తొలగించుకోండి