Site icon HashtagU Telugu

T20 World Cup 2024 : ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఫై భారత్ విజయం..

India Semi

India Semi

టీ 20 ప్రపంచకప్ 2024 ( T20 World Cup 2024)లో భాగంగా 51వ మ్యాచ్ ఈరోజు డారెన్ షమీ నేషనల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా (India Vs Australia) మధ్య జరిగింది. చివరి బల్ వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ .. ఆస్ట్రేలియా ఫై 24 రన్స్ తేడాతో విజయం సాధించి సెమీస్ కు వెళ్ళింది. ముందుగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. సిక్సులు, ఫోర్లతో బౌండరీల వర్షం కురిపించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ముందుగా ఓపెనర్ విరాట్ కోహ్లీ డకౌట్ అయినప్పటికీ…ఈ మాత్రం నిరాశ పడకుండా కెప్టెన్ రోహిత్ శర్మ (92) అదరగొట్టడమే కాదు.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో రికార్డు క్రియేట్ చేశాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక రిషబ్ పంత్ (15)తో అవుట్ అయ్యాడు.. ఆ తరువాత వచ్చిన సూర్యకుమారి యాదవ్ (31), శివం దూబే (28), హార్దిక్ పాండ్యా (27 నాటౌట్), రవీంద్ర జడేజా (9 నాటౌట్) ధనాధన్ బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో భారత్..ఆస్ట్రేలియా ముందు 206 పరుగుల భారీ టార్గెట్ ఉంచింది. భారత్ ఉంచిన 206 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ ఒకానొక టైములో ఛేదిస్తారని అంత భావించారు కానీ ..చివరకు 24 పరుగుల తేడాతో ఓటమి చెందింది. ఆ జట్టులో ట్రావిస్ హెడ్ (76) ఒంటరి పోరాటం చేశారు. మిచెల్ మార్ష్ (37) రాణించారు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టారు. ఇక జూన్ 27 న ఇంగ్లాండ్ తో భారత్ సెమిస్ ఆడనుంది.

Read Also : Johnny Master: ఆ ఆరోపణలు నిజమని నిరూపిస్తే ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతా