Hockey 5s Asia Cup 2023 Final: పాకిస్థాన్‌ని చిత్తు చేసిన భారత్

భారత్ పాకిస్థాన్ మధ్య పోరంటే.. ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తాయి. ఫ్యాన్స్ అయితే టీవీలకు అతుక్కుపోతారు.

Hockey 5s Asia Cup 2023 Final: భారత్ పాకిస్థాన్ మధ్య పోరంటే.. ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తాయి. ఫ్యాన్స్ అయితే టీవీలకు అతుక్కుపోతారు. ఓ వైపు యావత్ దేశం భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ మత్తులో తేలుతుంటే.. మరోవైపు భారత హాకీ జట్టు సంచలన విజయం నమోదు చేసింది. సొంతగడ్డపై జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత తన జోరును కొనసాగించింది. ఓటమెరుగని టీమ్‌గా సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకున్న హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత హాకీ జట్టు.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌‌‌ను మట్టి కరిపించింది. ఏషియన్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నీలో పాకిస్థాన్ ను చిత్తు చేసింది. అసాధారణ ప్రదర్శనతో ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ 6-4 తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.

నిజానికి మ్యాచ్ ప్రారంభం నుంచి పాక్ జోరు కనబర్చింది. ఆరంభం నుంచే భారత్ పై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఈ క్రమంలో భారత్ కు గట్టి పోటీ ఇచ్చింది. ఇరు జట్ల ఆటగాళ్లు గోల్స్ కోసం హోరాహోరీగా తలపడ్డారు. ఫస్టాఫ్ ముగిసే సరికి 3-2తో పాకిస్థాన్ ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్‌లో భారత ప్లేయర్ మహమ్మద్ రహీల్ వరుసగా రెండు గోల్స్ కొట్టి స్కోర్లు సమం చేశాడు. నిర్ణీత సమయంలో రెండు జట్లు 4-4తో సమంగా నిలవడంతో ఈ మ్యాచ్ ఫలితాన్ని షూటౌట్ ద్వారా నిర్ణయించారు. షూటౌట్‌లో భారత్ రెండు గోల్స్ చేస్తే .. పాకిస్థాన్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. షూటౌట్‌లో భారత ప్లేయర్లు మనిందర్ సింగ్, గుర్జోత్ సింగ్ గోల్స్ నమోదు చేశారు. దీంతో హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్ టోర్నీ విజేతగా టీమిండియా నిలిచింది.

Also Read: Rajanala : చెడు అలవాటు కోసం రాజనాల చేసిన పని.. ఒక మంచి కార్యానికి దారి తీసింది..