Site icon HashtagU Telugu

ACC Emerging Asia Cup 2023: మహిళల ఎమర్జింగ్ టీమ్స్ కప్ భారత్‌దే

ACC Emerging Asia Cup 2023

New Web Story Copy 2023 06 21t204545.783

ACC Emerging Asia Cup 2023: ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహిస్తున్న మహిళల ఎమర్జింగ్ టీమ్స్ కప్ ఫైనల్ లో భారత్ A జట్టు విజయం సాధించింది. భారత్ A జట్టు 31 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ A జట్టుపై గెలిచి టైటిల్ గెలుచుకుంది.

భారత్ ఎ జట్టు టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ ఎ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ ఎ జట్టు 19.2 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌటైంది. వాస్తవానికి తొలుత బ్యాటింగ్ చేసిన ఎ జట్టు పేలవమైన ఆరంభాన్నిచారు. శ్వేతా సెహ్రావత్ 20 బంతుల్లో 13 పరుగులు చేయగా.. దినేష్ బృందా 29 బంతుల్లో 36 పరుగులు చేసింది. కనికా అహుజా 23 బంతుల్లో అజేయంగా 30 పరుగులు చేసింది. దీంతో భారత మహిళల ఏ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేయగలిగింది.

128 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఎ మహిళల జట్టు పేలవమైన ప్రదర్శనతో మొదలు పెట్టింది.. 51 పరుగుల స్కోరు వద్ద సగం జట్టు పెవిలియన్‌కు చేరింది. బంగ్లాదేశ్ ఎ మహిళల జట్టు 19.2 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌటైంది. జట్టులో కేవలం ముగ్గురు బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరును దాటగలిగారు. ఈ విధంగా ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు విజయం సాధించింది. స్పిన్ బౌలర్ శ్రేయాంక పాటిల్ మరోసారి జట్టుకు అద్భుత ప్రదర్శన చేసింది. శ్రేయాంక 4 ఓవర్లలో 13 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది. దీంతో పాటు మన్నత్ కశ్యప్ 3 వికెట్లు తీయగా, కనికా అహుజా 2 వికెట్లు తీశారు.

Read More: Kashmir Willow Cricket Bat: క‌శ్మీర్ విల్లో క్రికెట్‌ బ్యాట్ల‌కు ఫుల్ క్రేజ్‌.. ఒక్కో బ్యాట్ ధ‌ర ఎంతో తెలుసా?