Site icon HashtagU Telugu

India Win ODI Series: సీరీస్ స్వీప్…నెంబర్ 1 పట్టేశారు

Team India

Team India (3)

India Win ODI Series: త్త ఏడాదిలో టీమిండియా ఖాతాలో మరో క్లీన్ స్వీప్ చేరింది. లంకను చిత్తు చేసిన భారత్ ఇప్పుడు న్యూజిలాండ్ జట్టును వన్డేల్లో క్లీన్ స్వీప్ చేసింది. హై స్కోరింగ్ మ్యాచ్ లో కివీస్ పై విజయం సాధించింది. దీంతో వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానం కైవసం చేసుకుంది.
మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ సెంచరీల మోత మోగించారు. ఈ ఇద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగారు. రోహిత్ మూడేళ్ల తర్వాత వన్డేల్లో తొలి సెంచరీ చేయగా.. గిల్ ఈ సిరీస్ లో రెండో సెంచరీ చేశాడు.
తొలి వికెట్ కు వీరిద్దరూ 26.1 ఓవర్లలోనే 212 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరూ శతకాలు పూర్తి చేసుకున్నారు. గిరోహిత్ 85 బంతుల్లో 9 ఫోర్లు , 6 సిక్సర్లతో 101 రన్స్ చేసి ఔటయ్యాడు. అటు మరోసారి కివీస్ బౌలింగ్ పై విరుచుకుపడిన గిల్ 78 బంతుల్లో 13 ఫోర్లు , 5 సిక్సర్లతో 112 పరుగులు చేశాడు.

ఓపెనర్లు ఔటైన తర్వాత భారత్ వేగంగా ఆడే క్రమంలో వికెట్లు కోల్పోయింది. కోహ్లీ 36, ఇషాన్ కిషన్ 17 , సూర్యకుమార్ యాదవ్ 14 రన్స్ కే ఔటయ్యారు. ఈ దశలో హార్దిక పాండ్య మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 36 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. వాషింగ్టన్ సుందర్ కూడా 25 రన్స్ తో రాణించారు. దీంతో టీమిండియా 50 ఓవర్లలో 9 వికెట్లకు 385 పరుగులు చేసింది.

లక్ష్య చేదనలో న్యూజిలాండ్ తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయింది. అయితే తర్వాతి బ్యాటింగ్ లో కాన్వే, నికోలస్ ధాటిగా ఆడడంతో కివీస్ స్కోర్ కూడా ఫస్ట్ గేర్ లో సాగింది. వికెట్లు కోల్పోతున్నా
కాన్వే మెరుపు సెంచరీ చేశాడు. అయితే 138 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర ఉమ్రన్ మాలిక్ అతన్ని ఔట్ చేయడంతో భారత్ ఊపిరి పీల్చుకుంది. చివర్లో బ్రేస్ వెల్ కాసేపు కంగారు పెట్టినా భారత్ బౌలర్లు కట్టడి చేశారు. హైదరాబాద్ తరహా అవకాశం అతనికి ఇవ్వలేదు. దీంతో కివీస్ 295 రన్స్ కి ఆలౌట్ అయింది.భారత్ బౌలర్లలో శార్దూల్ 3 , కుల్ దీప్ 3 , చాహాల్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో సీరీస్ ను స్వీప్ చేసిన రోహిత్ సేన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లింది.