Site icon HashtagU Telugu

India Victory : నెదర్లాండ్స్‌పై టీమిండియా విక్టరీ.. సెమీస్‌లో కివీస్‌తో ఢీ

India Squad

India Victory

India Victory : వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇవాళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లోనూ టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో నెదర్లాండ్స్‌ను ఓడించింది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 రన్స్ చేసింది. శ్రేయాస్ అయ్యర్ (128 నాటౌట్), కేఎల్ రాహుల్ (102) సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ రోహిత్ శర్మ (61), శుభ్ మాన్ గిల్ (51), కోహ్లీ (51) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. వరల్డ్ కప్‌లో టీమిండియా తరఫున టాప్-5 బ్యాటర్లు 50కిపైగా రన్స్ చేయడం ఇదే తొలిసారి.

Also read :Marriage Life : మ్యారేజ్ లైఫ్ ఆనందంగా ఉండాలంటే ఈ పనులు చేయండి..

411 రన్స్ లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన నెదర్లాండ్స్‌ను టీమిండియా బౌలర్లు 47.5 ఓవర్లలో 250 పరుగులకే ఆలౌట్ చేశారు. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ లో తెలుగుతేజం తేజ నిడమానూరు రాణించాడు. తేజ 39 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో 54 రన్స్ చేశాడు. ఓపెనర్ మాక్స్ ఓడౌడ్ 30, కోలిన్ అకెర్మన్ 35, ఎంగెల్ బ్రెక్ట్ 45 రన్స్ చేశాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్, జడేజా చెరో 2 వికెట్లు తీశారు. వరల్డ్ కప్‌లో ఇప్పటిదాకా ఆడిన 9 మ్యాచ్‌లు కూడా భారత టీమ్ గెలిచింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అగ్రస్థానంలో నిలిచింది. టీమిండియా సెమీస్ లో న్యూజిలాండ్‌తో(India Victory) తలపడనుంది.