World Cup 2023: బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం

ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో ఈ ప్రపంచ కప్ లో నాలుగు వరుస మ్యాచ్ లను గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.

World Cup 2023: ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో ఈ ప్రపంచ కప్ లో నాలుగు వరుస మ్యాచ్ లను గెలుచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. బంగ్లాదేశ్‌లో లిటన్ దాస్ అత్యధిక ఇన్నింగ్స్‌లో 66 పరుగులు చేశాడు. తాంజిద్ 51 పరుగులు చేశాడు. ముష్ఫికర్ రహీమ్ 38 పరుగులు, మహ్మదుల్లా 46 పరుగులు చేశారు.

లక్ష్యాన్ని భారత్ 41.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసి ఛేదించింది. రోహిత్ శర్మ 48 పరుగులు చేశాడు. శుభ్‌మన్ గిల్ 53 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. ఇన్నింగ్స్ లో విరాట్ కోహ్లీ 103 పరుగులతో సెంచరీ కొట్టి నాటౌట్‌గా నిలిచాడు. కేఎల్ రాహుల్ 34 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శ్రేయస్ 19 పరుగులు మాత్రమే చేయగలిగాడు.

భారత్ ప్లేయింగ్ 11 – రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్ మరియు మహ్మద్ సిరాజ్.

బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11 – లిటన్ దాస్, తంజిద్ హసన్, నజ్ముల్ హుస్సేన్ శాంటో (కెప్టెన్), మెహదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్, తౌహిద్ హద్దే, మహ్మదుల్లా, నసుమ్ అహ్మద్, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్ మరియు షరీఫుల్ ఇస్లాం.

Also Read: Israel Hamas War: ఇజ్రాయెల్ ప్రధానితో బ్రిటిష్ ప్రధాని రిషి సునక్ భేటీ