Paris Paralympics 2024: పారా ఒలింపిక్స్‌.. ఒకేరోజు నాలుగు ప‌త‌కాలతో స‌త్తా..!

పారిస్ పారాలింపిక్స్‌లో అవనీ చరిత్ర సృష్టించింది. 249.7 స్కోరుతో స్వర్ణ పతకం సాధించింది. ఈ క్రమంలో తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. ఆమెను టోక్యో పారాలింపిక్స్‌లో 249.6 స్కోర్ చేసింది.

Published By: HashtagU Telugu Desk
Paris Paralympics 2024

Paris Paralympics 2024

Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్ 2024లో (Paris Paralympics 2024) అవని లేఖరా చరిత్ర సృష్టించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ SH1 విభాగంలో ఆమె బంగారు పతకాన్ని గెలుచుకుంది. పారాలింపిక్స్‌లో ఆమెకిది రెండో స్వర్ణం. అంతకుముందు టోక్యోలో స్వర్ణం, కాంస్య పతకం కూడా సాధించింది.

పారిస్ పారాలింపిక్స్‌లో అవనీ చరిత్ర సృష్టించింది. 249.7 స్కోరుతో స్వర్ణ పతకం సాధించింది. ఈ క్రమంలో తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. ఆమెను టోక్యో పారాలింపిక్స్‌లో 249.6 స్కోర్ చేసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (SH1) విభాగంలో అవ‌నీ స్వర్ణం సాధించింది. పారాలింపిక్స్‌లో అవ‌నీ వరుసగా రెండోసారి బంగారు పతకం సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (ఎస్‌హెచ్ 1) విభాగంలో ఆమె మొదటి స్థానంలో నిలిచింది. ఇదే ఈవెంట్‌లో భారత మరో పారా షూటర్ మోనా అగర్వాల్ కాంస్యం సాధించింది.

Also Read: Deputy CM Bhatti: ప్రజలపై భారం వేయకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి: డిప్యూటీ సీఎం భ‌ట్టి

625.8 స్కోరుతో ఫైనల్‌కు చేరింది

మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్ (SH1) క్వాలిఫికేషన్‌లో అవని లేఖరా రెండో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు చేరుకుంది. ఆమె అర్హతలో 625.8 స్కోర్ సాధించింది. కాగా, స్వదేశానికి చెందిన మోనా అగర్వాల్ క్వాలిఫికేషన్‌లో ఐదో స్థానంలో నిలిచింది. ఇరినా షెట్నిక్ మొదటి స్థానంలో ఉంది. క్వాలిఫికేషన్ రౌండ్‌లో ఆమె 627.5 స్కోర్ చేసింది.

పారిస్ పారాలింపిక్స్ 2024లో అథ్లెటిక్స్‌లో భారత్‌కు మూడో పతకం లభించింది. ప్రీతీ పాల్ ఈ పతకాన్ని గెలుచుకుంది. అథ్లెటిక్స్ పోటీల్లో పతకం సాధించి చరిత్ర సృష్టించింది ప్రీతీపాల్. మహిళల 100 మీటర్ల T-35 ఈవెంట్‌లో ఆమె 14.21 సెకన్లతో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. పారా గేమ్స్‌లో ట్రాక్ ఈవెంట్ పోటీల్లో భారత్‌కు ఇదే తొలి పతకం. ఇప్పటి వరకు ఈ ఈవెంట్‌లో భారత్‌కు పతకం రాలేదు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రీతి పాల్ తన అత్యుత్తమ సమయాన్ని 14.21 సెకన్లతో ఈ రేసును పూర్తి చేసింది. అయితే ఆమె చైనాకు చెందిన జియా జౌ, కియాన్‌కియాన్ గువోల వెనుకే ఉండిపోయింది. ఈ ఈవెంట్‌లో బంగారు, రజత పతకాలు చైనాకు దక్కాయి. కాగా 23 ఏళ్ల ప్రీతి తొలిసారి పారాలింపిక్స్‌లో పాల్గొని భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. పారిస్ పారాలింపిక్స్‌లో 200 మీటర్ల ఈవెంట్‌లో కూడా ప్రీతి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తుంది. పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ పురుషుల 10మీ. ఎయిర్ పిస్టల్ ఎస్‌హెచ్-1 విభాగంలో మనీశ్ నర్వాల్ రజత పతకం సాధించారు. దీంతో భారత్ ఖాతాలో 4 పతకాలు చేరాయి.

  Last Updated: 30 Aug 2024, 11:55 PM IST