కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత మహిళల క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ , వైస్ కెప్టెన్ గా స్మృతి మందానా ఎంపికయ్యారు. ఇటీవలే శ్రీలంక టూర్ లో అదరగొట్టిన భారత మహిళల జట్టు ఈ మెగా ఈవెంట్ లోనూ ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. శ్రీలంకతో సిరీస్ నుంచే కామన్వెల్త్ గేమ్స్‌కు సన్నాహాలు ప్రారంభించామనీ కోచ్ రమేష్ పోవార్ చెప్పాడు. వికెట్స్ నెమ్మదిగా ఉంటాయని అంచనా వేస్తున్నట్టు,ఎక్కువ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశముందన్నాడు. అయితే హర్మన్ ప్రీత్, షెఫాలీ వర్మ, జెమియా రోడ్రిగ్స్, స్మృతి మంధానా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారనీ, వాళ్లే కీలకం కానున్నారని రమేశ్ పొవార్ అన్నారు.టీ20 ఫార్మాట్ లో మ్యాచ్ లు జరగనున్నాయి. గ్రూప్-ఏలో భారత్, ఆస్ట్రేలియా, బార్బడోస్, పాకిస్థాన్ ఉండగా.. శ్రీలంక, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా గ్రూప్-బీలో ఉన్నాయి. ఈ నెల 29న ఆస్ట్రేలియాతో భారత్ తొలి మ్యాచ్ ఆడనుండగా… రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్‌కు చేరతాయి. తొలి సారిగా మహిళల జట్టు ఈ పోటీల్లో పాల్గొంటున్న తరుణంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 1998లో జరిగిన కౌలాలంపూర్ గేమ్స్‌లో పురుషుల జట్టు తొలిసారి ప్రాతినిధ్యం వహించింది.
Squad: Harmanpreet Kaur (c), Smriti Mandhana (vc), Shafali Verma, Sabbhineni Meghana, Taniyaa Bhatia (wk), Yastika Bhatia (wk), Deepti Sharma, Rajeshari Gayakwad, Pooja Vastrakar, Meghna Singh, Renuka Thakur, Jemimah Rodrigues, Radha Yadav, Harleen Deol, Sneh Rana
Standby players: Richa Ghosh, Simran Bahadur, Poonam Yadav