Site icon HashtagU Telugu

IND-W vs SA-W Final: మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే టైటిల్ ఎవరికి?

IND-W vs SA-W Final

IND-W vs SA-W Final

IND-W vs SA-W Final: మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా, దక్షిణాఫ్రికాతో (IND-W vs SA-W Final) తలపడాల్సి ఉంది. అయితే నవీ ముంబైలో వాతావరణం అనుకూలించడం లేదు. మైదానంలో భారీ వర్షం కురుస్తోంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఇప్పటివరకు టాస్ కూడా వేయడానికి వీలు కాలేదు. (గ‌మ‌నిక‌- ఈ వార్త రాసే స‌మయానికి సౌతాఫ్రికా జ‌ట్టు టాస్ గెలిచి మొద‌ట ఫీల్డింగ్ ఎంచుకుంది). మైదానానికి వచ్చిన అభిమానులు వర్షం త్వరగా ఆగిపోవాలని కోరుకుంటున్నారు. అయితే ఇదే విధంగా వర్షం కొనసాగితే ప్రపంచ కప్ టైటిల్ ఏ జట్టు ఖాతాలోకి వెళ్తుందనేది పెద్ద ప్రశ్న. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

వర్షంతో ఫైనల్ రద్దయితే ఎవరు ఛాంపియన్ అవుతారు?

నవీ ముంబైలో టీమ్ ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య టైటిల్ పోరు చూడటానికి వేలాది మంది అభిమానులు వర్షం ఆగే వరకు ఎదురుచూస్తున్నారు. అయితే వాన దేవుడు ఇప్పటివరకు అభిమానుల మొర వినలేదు. మైదానంలో వర్షం దంచికొడుతూనే ఉంది. అంతకంటే చెడ్డ విషయం ఏమిటంటే.. సాయంత్రం నాలుగు గంటల తర్వాత కూడా డీవై పాటిల్ స్టేడియంలో వర్షం పడే అవకాశం 50 శాతం కంటే ఎక్కువగా ఉంది. అంటే ప్రస్తుతానికి ఎలాంటి ఉపశమనం లేదు.

Also Read: 21st Installment: 11 కోట్ల మందికి శుభవార్త‌.. ఖాతాల్లోకి రూ. 2 వేలు?!

ఇప్పుడు నవంబర్ 2న వర్షం కారణంగా ఒక్క ఓవర్ ఆట కూడా సాధ్యం కాకపోతే మ్యాచ్ కోసం రిజర్వ్ డే కేటాయించారు. అంటే నవంబర్ 3న కూడా ఫైనల్ మ్యాచ్‌ను పూర్తి చేయవచ్చు. అయితే నవంబర్ 2, 3 తేదీలు రెండింటిలోనూ ఆట సాధ్యం కాకపోతే రెండు జట్లు ట్రోఫీని పంచుకోవాల్సి వస్తుంది. అంటే భారత్- దక్షిణాఫ్రికా సంయుక్తంగా (Jointly) ఛాంపియన్‌లుగా ప్రకటితమవుతాయి.

చరిత్ర సృష్టించేందుకు టీమ్ ఇండియాకు సువర్ణావకాశం

హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని జట్టుకు ఫైనల్‌లో చరిత్ర సృష్టించే సువర్ణావకాశం ఉంది. భారత జట్టు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐసీసీ ప్రపంచ కప్ ట్రోఫీని గెలవలేదు. సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఏడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను ఓడించి సత్తా చాటింది. ఆ మ్యాచ్‌లో జెమిమా రోడ్రిగ్స్ బ్యాట్ అద్భుతంగా రాణించింది. ఆమె 127 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చింది. అదేవిధంగా హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా అద్భుతమైన బ్యాటింగ్‌తో 89 పరుగుల బలమైన ఇన్నింగ్స్ ఆడింది. ఫైనల్ మ్యాచ్‌లో కూడా టీమ్ ఇండియా వీరిద్దరి నుండి ఇలాంటి అద్భుతమైన ప్రదర్శననే ఆశిస్తుంది.

Exit mobile version