WI vs IND: రెండో వన్డే ప్రివ్యూ

థ్రిల్లింగ్‌గా సాగుతుందనుకున్న మొదటి వన్డేలో విండీస్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. భారీ హిట్టర్లున్న కరేబియన్ జట్టు అదే పేలవ ప్రదర్శన కొనసాగించింది.

WI vs IND: థ్రిల్లింగ్‌గా సాగుతుందనుకున్న మొదటి వన్డేలో విండీస్ ఆటగాళ్లు చేతులెత్తేశారు. భారీ హిట్టర్లున్న కరేబియన్ జట్టు అదే పేలవ ప్రదర్శన కొనసాగించింది. దీంతో టీమిండియా ఆటగాళ్లు పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. స్వల్ప లక్ష్యం ముందుండటంతో ఎడాపెడా బాదొచ్చారు. మొత్తానికి మొదటి వన్డే టీ20 తరహాలోనే సాగింది. రెండో వన్డేలోనైనా కరేబియన్లు పూర్వవైభవాన్ని ప్రదర్శిస్తారో లేదో చూడాలి.

తొలి మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. మొదట జడేజా తన అద్భుతమైన స్పిన్‌ మాయాజాలాన్ని పరిచయం చేశాడు. జడ్డుకి ఏ మాత్రం తగ్గకుండా కుల్దీప్‌ పసందైన డెలివరీలతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి ఎకౌంట్లో 7 వికెట్లు కుప్పకూలాయి. కుల్దీప్‌ నాలుగు వికెట్లు పడగొట్టగా, జడేజా మూడు వికెట్లు తీసుకున్నాడు. అదే సమయంలో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌లను కాస్త ఇబ్బంది పెట్టారు.

రెండో వన్డేలో వెస్టిండీస్ తిరిగి పుంజుకోవాలని చూస్తోంది. మొదటి మ్యాచ్‌లో బ్యాట్‌తో పేలవమైన ప్రదర్శన చేసిన వెస్టిండీస్ జట్టులో కూడా మార్పులు చూడొచ్చు. వన్డే ప్రపంచకప్‌ రేసుకు దూరమైన కరీబియన్‌ జట్టులో ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మెన్‌లు, బౌలింగ్ లో సత్తా చాటే ఆటగాళ్లకు కొదువే లేదు. అయితే డొమినిక్ డ్రేక్స్ లేదా జేడెన్ సీల్స్ స్థానంలో ఓషానే థామస్ లేదా అల్జారీ జోసెఫ్ ప్లేయింగ్ XIకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా అదే ఫార్ములాతోనే వెళ్లే అవకాశం ఉంది.

ఫస్ట్ వన్డే తరువాత రోహిత్ కొన్ని హింట్స్ ఇచ్చాడు. వరల్డ్ కప్ దగ్గరపడుతోంది కాబట్టి కొత్త తరణానికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో సెకండ్ వన్డేలో టీమిండియాలో కొన్ని మార్పులు జరగొచ్చంటున్నారు విశ్లేషకులు. రెండో వన్డేలో రన్ మిషన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చి సంజు శాంసన్ కి అవకాశం ఇవ్వొచ్చు. ఎందుకంటే సూర్య కుమార్ యాదవ్ పేలవ ప్రదర్శనని చూసి కూడా మొదటి వన్డేలో ప్లేయింగ్ ఎలెవన్ లో సంజుకి స్థానం కల్పించకపోవడంతో ఇప్పటికే బీసీసీఐ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సో మొత్తానికి మొదటి వన్డే ఎలా ఉన్నా… రెండో వన్డే మాత్రం అంత కూల్ గా అయితే సాగేలా లేదు. భారీ హిట్టర్లున్న విండీస్ ఆటగాళ్లు భారత్ పై ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం ఇదే కాబట్టి వచ్చిన అవకాశాన్ని వదులుకోవడానికి వారైతే సిద్ధంగా లేరు. దీంతో రెండో వన్డే త్రిల్లింగ్ గా కాకపోయినా టెన్షన్ వాతావరణాన్ని అయితే క్రియేట్ చేయగలదు.

ఓవల్‌ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేస్తేనే బెటరంటున్నారు విశ్లేషకులు.

Also Read: Murder : భార్య హత్య కేసులో తెలంగాణ యూత్ కాంగ్రెస్ లీడ‌ర్‌ అరెస్ట్