Site icon HashtagU Telugu

WI vs IND: జోరు కొనసాగేనా..? నాలుగో టీ ట్వంటీకీ సేమ్ కాంబినేషన్..

IND vs WI

New Web Story Copy 2023 08 10t202756.974

WI vs IND: వెస్టిండీస్ , భారత్ టీ ట్వంటీ సిరీస్ చివరి అంకానికి చేరింది. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడినా మూడో టీ ట్వంటీ గెలిచిన టీమిండియా సీరీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. ఇప్పుడు అమెరికా వేదికగా చివరి రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. నాలుగో మ్యాచ్ లోనూ గెలిచి సీరీస్ సమం చెయ్యాలని పట్టుదలగా ఉంది. ఫ్లోరిడాలో జరగనున్న మ్యాచ్ కోసం రెడీ అవుతున్న భారత్ తుది జట్టులో మార్పులు చేసే అవకాశాలు కనిపించడం లేదు. మూడో టీ ట్వంటీ లో ఆడిన కాంబినేషన్‌ను కొనసాగించనుంది. ఇషాన్ కిషన్‌పై వేటు వేసిన టీమ్‌మేనేజ్‌మెంట్ యశస్వి జైస్వాల్‌కు అవకాశం ఇచ్చింది. అతను నిరాశపరిచినప్పటికే మరో అవకాశం ఇవ్వనున్నారు. తెలుగు తేజం తిలక్ వర్మ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ సత్తా చాటడం… సూర్యకుమార్ యాదవ్ ఫామ్ అందుకోవడం జట్టుకు అడ్వాంటేజ్. ముఖ్యంగా సూర్య కుమార్ జోరు కొనసాగితే టీ ట్వంటీ సిరీస్ గెలవడం పెద్ద కష్టం కాదు.

అయితే ఓపెనింగ్ జోడీ సత్తా చాటితే టీమిండియాకు తిరుగుండదు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ శుభారంభం అందిస్తే భారత్ భారీ స్కోర్ కు పునాది పడినట్టే. ఇక వికెట్ కీపర్‌ సంజూ శాంసన్ కూడా సత్తా చాటాల్సిన అవసరం ఉంది. అతి బౌలింగ్ కాంబినేషన్‌లోనూ పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. ఆవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్‌లకు అవకాశం కల్పించాలనుకుంటే ముకేష్ కుమార్‌ను పక్కనపెట్టే అవకాశం ఉంది. సిరీస్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌ కావడంతో ఆ దిశగా అడుగులు వేయకపోవచ్చు. స్పిన్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, చాహల్ మంచి ప్రదర్శన కనబర్చారు. అదే జోరు కొనసాగిస్తే విండీస్ ను కట్టడి చేయొచ్చు.

ఇదిలా ఉంటే మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న ఫ్లోరిడా పిచ్ బౌలింగ్ కు అనుకూలిస్తుంది. మొదట బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్నా…మ్యాచ్ సాగే కొద్దీ పిచ్ స్లో అవుతోంది. ఇక్కడ గత రికార్డులు చూస్తే 14 మ్యాచ్ ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 11 సార్లు విజయం సాధించింది. దీంతో టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ కే మొగ్గు చూపొచ్చు.

Read More: World Cup 2023: వరల్డ్ కప్ నుంచి గిల్ అవుటేనా?