West Indies Beat India: రెండో వన్డేలో భారత్ పై వెస్టిండీస్ విజయం

బార్బడోస్ వన్డేలో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్‌ (West Indies Beat India)పై విజయం సాధించింది.

  • Written By:
  • Publish Date - July 30, 2023 / 06:29 AM IST

West Indies Beat India: టెస్టు సిరీస్ గెలిచిన టీమిండియాకు వెస్టిండీస్ పర్యటనలో మొదటి ఎదురుదెబ్బ తగిలింది. బార్బడోస్ వన్డేలో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్‌ (West Indies Beat India)పై విజయం సాధించింది. వెస్టిండీస్‌ ముందు టీమిండియా 182 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్‌లో కరీబియన్ జట్టు 36.4 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసి విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్‌ 1-1తో సమమైంది.

వెస్టిండీస్ తరఫున కెప్టెన్ హోప్ అత్యధికంగా 63 పరుగులతో అజేయంగా నిలిచాడు. కైచి కార్టీ 48 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వెస్టిండీస్ జట్టు 91 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయినా ఇద్దరు ఆటగాళ్లు జట్టును కష్టాల్లోంచి గట్టెక్కించారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమం అయింది. మెుదట టీమిండియా బ్యాటింగ్ కు దిగింది. 181 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ 55, శుభమన్ గిల్ 34 రాణించారు.

Also Read: IND vs WI 2nd ODI: కుప్పకూలిన టీమిండియా . కష్టాల్లో భారత్

181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 36.4 ఓవర్లలోనే గెలిచింది. విండీస్ బ్యాట్స్ మెన్ హోప్ 63, కార్టీ 48 నాటౌట్ గా నిలిచారు. కైల్ మేయర్స్ 36 పరుగులు చేశాడు. అంతకు ముందు టాస్ ఓటి బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్లు కిషన్, గిల్.. మంచి ఆరంభం అందించారు. నిలకడగా ఆడి 90 పరుగులు చేశారు. అప్పటి వరకూ వికెట్ పడలేదు. తర్వాత వరుసగా వికెట్లు పడ్డాయి. అక్షర్ పటేల్ 1, సంజు శాంసన్ 9, హార్దిక్ పాండ్య 7 పరుగులు చేశారు. 113 పరుగులకు ఇండియా 5 వికెట్లు కోల్పోయింది.

తర్వాత వర్షం అంతరాయం కలిగించింది. వర్షం తగ్గి మ్యాచ్ ప్రారంభమైన తర్వాత కూడా వికెట్లు పడ్డాయి. సీనియర్ ఆటగాళ్లు సైతం త్వరగానే ఔటయ్యారు. జడేజా 10, సూర్యకుమార్ కూడా ఔట్ కావడంత భారత్ కష్టాల్లో పడింది. శార్దూల్ ఠాకూర్ కూడా ఎక్కువసేపు క్రీజులో లేడు. 16 పరుగులు చేసి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఉమ్రాన్ మాలిక్ 0, ముకేశ్ కుమార్ 6 పరుగులు చేశారు. ఈ సిరీస్ లో మూడో వన్డే ఆగస్టు 1న జరగనుంది.