Site icon HashtagU Telugu

Ind Vs SL : హిట్ మ్యాన్ ను ఊరిస్తున్న మరో రికార్డ్

Rohit Ishan

Rohit Ishan

ధర్మశాల వేదికగా ఈరోజు శ్రీలంకతో రెండో టీ20కు మందు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మను ప్ర‌పంచ రికార్డు ఊరిస్తోంది. .. ఈ మ్యాచ్‌లో టీమిండియా గనుక విజయం సాధిస్తే.. కెప్టెన్‌గా రోహిత్ శర్మ అరుదైన మైలురాయిని చేరుకోనున్నాడు. స్వదేశంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇప్పటివరకు 16 టీ20 మ్యాచ్‌లాడిన టీమిండియా.. 15 మ్యాచ్‌ల్లో గెలుపొందింది… ఈ నేపథ్యంలో ఇప్పటికే టీమిండియా మాజీ సారథులు ఎంఎస్ ధోనీ , విరాట్ కోహ్లీ రికార్డ్‌లను బ్రేక్ చేసిన రోహిత్ శర్మ.. నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ రెండో టీ20 మ్యాచ్ లో గనుక టీమిండియా విజయం సాధిస్తే .. అంతర్జాతీయ టీ20 క్రికెట్ హిస్టరీలో స్వదేశంలో అత్యధిక టీ20 విజయాల్ని సాధించిన సారథిగా రోహిత్ శర్మ ఘనత సాదించనున్నాడు..

ప్రస్తుతం టీ20ల్లో స్వదేశంలో అత్యధిక విజయాల్ని సాధించిన సారథులు జాబితాలో 15 విజయాలతో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, టీమిండియా సారథి రోహిత్ శర్మ టాప్‌లో ఉన్నారు. ఈ క్రమంలో .. ఈరోజు శ్రీలంకతో రెండో టీ20లో టీమిండియా గనుక విజయం సాధిస్తే..సారథిగా రోహిత్ శర్మ 16 విజయాలతో మోర్గాన్, విలియంసన్ ను వెనక్కి నెట్టి నెం.1 అగ్ర స్థానానికి చేరుకోనున్నాడు…

ఇదిలాఉంటే.. తొలి టీ20లో రోహిత్ శ‌ర్మ సరికొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులుచేసిన ఆట‌గాడిగా వరల్డ్ రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు న్యూజిలాండ్ సీనియర్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్ పేరిట ఉండ‌గా.. రోహిత్ శర్మ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 123 టీ20లు ఆడిన హిట్ మ్యాన్.. 32.74 స‌గ‌టుతో 3307 ప‌రుగులు చేశాడు. ఇందులో 4 సెంచ‌రీలు, 26 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

Exit mobile version