IND vs SL T20: కీపర్ పోస్ట్ కోసం సంజూ, పంత్ మధ్య పోటీ

టీ20 సిరీస్‌కు గానూ టీమిండియాలో వికెట్ కీపర్ మరియు బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ చోటు దక్కించుకున్నాడు. రిషబ్ పంత్ కూడా జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. పంత్ జట్టులో ఉండటంతో శాంసన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉండకపోవచ్చు

IND vs SL T20: 3 టి20 మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు శ్రీలంక చేరుకుంది. జూలై 27 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ తో గౌతమ్ గంభీర్ కోచ్ గా జర్నీ మొదలుపెట్టబోతున్నాడు . ఈ పర్యటన ద్వారా చాలా మంది యువ ఆటగాళ్లకు తమ సత్తా నిరూపించుకునే అవకాశం లభించింది. అయితే టీ20 సిరీస్‌ తుది జట్టులో ఎవరుంటారనేది ఆసక్తిగా మారింది.

టీ20 సిరీస్‌కు గానూ టీమిండియాలో వికెట్ కీపర్ మరియు బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ చోటు దక్కించుకున్నాడు. రిషబ్ పంత్ కూడా జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. పంత్ జట్టులో ఉండటంతో శాంసన్ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఇటీవల జరిగిన టి20 ప్రపంచ కప్ జట్టులో కూడా వీరిద్దరూ ఉన్నారు. కానీ పంత్ అన్ని మ్యాచ్‌లు ఆడినప్పటికీ, శాంసన్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అందువల్ల శ్రీలంక పర్యటనలో కూడా అతనికి టీ20 ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కకపోవచ్చు. అటు రోహిత్ సారధ్యంలో టీమిండియా లంకతో మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ కు సిద్దమవుతుంది. జట్టును కూడా ఖరారు చేశారు.

సంజు శాంసన్ కు నిరాశే ఎదురైంది. ఈ సిరీస్ కు సంజుకి అవకాశమే దక్కలేదు. 2015లో జింబాబ్వేతో జరిగిన టీ20లో సంజూ శాంసన్ అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించాడు. గత 9 సంవత్సరాలలో సంజుకి వచ్చిన అవకాశాల సంఖ్య థలా తక్కువే. ఒకవేళ జట్టుకి ఎంపికైనప్పటికీ ఆడే అవకాశం మాత్రం కల్పించలేదు. సంజు శాంసన్ ఎన్నో మ్యాచ్ లకు బెంచ్ కె పరిమితమయ్యాడు. కాగా భారత జట్టుకు అరంగేట్రం చేసిన యువ ఆటగాళ్లు పంత్, గిల్, హార్దిక్, బుమ్రా జట్టులో స్థానం పదిలం చేసుకున్నారు. కెప్టెన్సీ పదవులను కూడా దక్కించుకుంటున్నారు. అయితే సంజు శాంసన్ మాత్రం ఇప్పటికీ ఏ ఫార్మాట్‌లోనూ తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోతున్నాడు. 9 ఏళ్లలో 16 వన్డేలు, 28 టీ20లు మాత్రమే ఆడగలిగాడు. అయితే అవకాశం వచ్చినప్పుడు శాంసన్ అంతగా ఆడకపోవడం కూడా అతని కెరీర్ పై ప్రభావం పడుతుంది. అటు వన్డేలోకి కేఎల్ రాహుల్ ఎంట్రీతో వన్డేలో సంజూ దారులు మూసుకుపోయాయి. చూడాలి మరి ఫ్యూచర్ సిరీస్ లలో సంజుకి అవకాశం కల్పిస్తారో లేదో.

Also Read: IAS Officers: ఢిల్లీలో ఎనిమిది మంది ఐఏఎస్‌లు బదిలీ

Follow us