IND vs SA 1st Test: బాక్సింగ్ డే టెస్టులో కేఎల్ రాహుల్ సెంచరీ

కేఎల్ రాహుల్ రెండేళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌లో సెంచరీ సాధించాడు. అతను 2021లో దక్షిణాఫ్రికాపై తన చివరి సెంచరీని సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో కేఎల్ రాహుల్ తన టెస్టు కెరీర్‌లో ఎనిమిదో సెంచరీని నమోదు చేశాడు.

IND vs SA 1st Test: కేఎల్ రాహుల్ రెండేళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌లో సెంచరీ సాధించాడు. అతను 2021లో దక్షిణాఫ్రికాపై తన చివరి సెంచరీని సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో కేఎల్ రాహుల్ తన టెస్టు కెరీర్‌లో ఎనిమిదో సెంచరీని నమోదు చేశాడు. రాహుల్ 133 బంతుల్లో 14 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు.టెస్టు క్రికెట్‌లో సరిగ్గా రెండేళ్ల తర్వాత కేఎల్ రాహుల్ ఈ సెంచరీ నమోదు చేశాడు. ఇదే దక్షిణాఫ్రికాపై తన ఏడో టెస్టు సెంచరీని సాధించాడు. 26 డిసెంబర్ 2021న సెంచూరియన్‌లోనే ఈ సెంచరీ సాధించాడు.

విదేశీ గడ్డపై రాహుల్‌కిది ఏడో సెంచరీ. రాహుల్ దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్ మరియు ఇంగ్లండ్‌లపై సెంచరీలు నమోదు చేశాడు. కాగా రాహుల్ వికెట్ తో భారత్ తొలి ఇన్నింగ్స్ 245 పరుగులకు ఆలౌట్ అయింది.

బాక్సింగ్ డే టెస్టుతో కేఎల్ రాహుల్ కి ప్రత్యేక అనుబంధం ఉంది. రాహుల్ కెరీర్‌లో ఇది మూడో బాక్సింగ్ డే టెస్టు. దీనికి ముందు, అతను 2021 మరియు 2014లో బాక్సింగ్ డే టెస్ట్ ఆడాడు. రాహుల్ టెస్ట్ అరంగేట్రం బాక్సింగ్ డే టెస్టులో. 26 డిసెంబర్ 2014న, రాహుల్ మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత, రెండో బాక్సింగ్ డే టెస్టు 26 డిసెంబర్ 2021 సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాపై 123 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. మళ్లీ ఈ ఏడాది బాక్సింగ్ డే టెస్టులోనే సెంచరీ సాధించాడు.

Also Read: Hair Tips: మీ జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగాలి అంటే.. వీటిని జుట్టుకు అప్లై చేయాల్సిందే?