T20 World Cup Final: ద్రవిడ్ కు ఘనమైన వీడ్కోలు..కప్ ముఖ్యం రోహిత్

టీ20 వరల్డ్​కప్​ ఫైనల్ మ్యాచ్​తో టీమ్ఇండియా హెడ్​కోచ్ ​రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలం ముగియనుంది. ఈ టోర్నీ తర్వాత ద్రవిడ్‌ పదవీ విరమణ చేయనున్నాడు. అయితే తనకు మర్చిపోలేని వీడ్కోలు పలికేందుకు టీమిండియా సిద్ధమైంది. టి20 ప్రపంచకప్ టైటిల్ నెగ్గి రాహుల్ చేతిలో పెట్టాలని జట్టు సభ్యులు భావిస్తున్నారు.

T20 World Cup Final: మరికొద్ది గంటల్లో టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో సౌతాఫ్రికా, టీమిండియా టైటిల్ మ్యాచ్ లో తలపడనున్నాయి.ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించి సౌతాఫ్రికా ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోగా, రెండో సెమీ ఫైనల్‌లో భారత్ ఇంగ్లండ్‌ను ఓడించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా ఇప్పటివరకు వరుసగా 8 మ్యాచ్‌లు గెలుపొందగా, భారత్ వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. భారత్‌ ఆడాల్సిన మ్యాచ్‌ ఒకటి వర్షం కారణంగా రద్దయింది. అంటే ఇరు జట్లలో ఏ జట్టు విజయం సాధించినా 17 ఏళ్ల టీ-20 క్రికెట్ చరిత్రలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఓ జట్టు ట్రోఫీని కైవసం చేసుకోవడం ఇదే తొలిసారి అవుతుంది.

టీ20 వరల్డ్​కప్​ ఫైనల్ మ్యాచ్​తో టీమ్ఇండియా హెడ్​కోచ్ ​రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలం ముగియనుంది. ఈ టోర్నీ తర్వాత ద్రవిడ్‌ పదవీ విరమణ చేయనున్నాడు. అయితే తనకు మర్చిపోలేని వీడ్కోలు పలికేందుకు టీమిండియా సిద్ధమైంది. టి20 ప్రపంచకప్ టైటిల్ నెగ్గి రాహుల్ చేతిలో పెట్టాలని జట్టు సభ్యులు భావిస్తున్నారు. 2007లో కరీబియన్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ త్వరగా ఎలిమినేట్‌ అయినప్పుడు, కెప్టెన్‌గా ద్రవిడ్‌ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇప్పుడు అదే చోట కోచ్‌గా వీడ్కోలు ముంగిట నిల్చున్నాడు. చాలా ఏళ్ల తర్వాత అదే విండీస్ గడ్డపై ఐసీసీ ట్రోఫీ అందుకునే ఛాన్స్ వచ్చింది. దీంతో ఈసారైనా టీమ్ఇండియా నెగ్గాలని ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు.

2021 టీ20 ప్రపంచకప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ భారత జట్టుకు కోచ్‌గా నియమితులయ్యారు. కోచ్‌గా అతని పదవీకాలం అద్భుతంగా సాగింది. ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత జట్టు మంచి ప్రదర్శన కనబరిచింది. ఇక ఆయనకు వీడ్కోలు పలికే సమయం ఆసన్నమైన నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ లో టీమిండియా ఫైనల్‌ల్లో ఎలాగైనా నెగ్గాల్సి ఉంది. ప్రపంచకప్ గెలవడం ద్వారా ద్రవిడ్‌కు చిరస్మరణీయ వీడ్కోలు అందించడమే జట్టు లక్ష్యం కావాలి. ఆటగాడిగా మరియు కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థాయి అందనంత ఎత్తులో ఉన్నప్పటికీ ఈ ప్రపంచకప్ టైటిల్ మాత్రం రాహుల్ కి ది బెస్ట్ గిఫ్ట్ అని చెప్పొచు.

Also Read: D.Srinivas Passes Away: డీఎస్ మృతిపట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం