Site icon HashtagU Telugu

IND vs SA1st Test: తొలి టెస్టులో రోహిత్ శర్మ ఔట్

IND vs SA1st Test

IND vs SA1st Test

IND vs SA 1st Test: భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు ప్రారంభమైంది. ప్రపంచకప్ తర్వాత హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తొలిసారి మైదానంలో అడుగుపెట్టాడు. దీంతో రోహిత్ సెంచరీ చేస్తాడని అందరూ భావించారు. కానీ తీవ్రంగా నిరాశపరిచి 5 పరుగులకే పెవిలియన్ చేరాడు. 14 బంతులు ఎదుర్కొన్న రోహిత్ ఒక బౌండరీ కొట్టి 5 పరుగులకే అవుట్ అయ్యాడు.బాడ బౌలింగ్‌లో నాంద్రే బర్గర్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో భారత్ 13 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. అయితే రోహిత్ అవుట్ అయిన కాసేపటికే యశస్వి జైస్వాల్ వికెట్ సమర్పించుకున్నాడు. 37 బంతులు ఎదుర్కొని 17 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ లో జైస్వాల్ 4 బౌండరీలు సాధించాడు. ఈ క్రమంలో శుభ మన్ గిల్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. గిల్ 12 బంతుల్లో 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ తడిగా మారడంతో మ్యాచ్ సమయం కంటే 15 నిమిషాలు ఆలస్యంగా టాస్ వేశారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ కు దిగింది. ఇక ఈ మ్యాచ్ ద్వారా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ టెస్టు క్రికెట్‍లో అరంగేట్రం చేయగా వెన్ను సమస్య కారణంగా రవీంద్ర జడేజా తొలి టెస్టుకు దూరమయ్యాడు. నలుగురు పేసర్లు బుమ్రా, షార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణతో బరిలోకి దిగిన టీమిండియా స్పిన్నర్‌గా రవిచంద్రన్ అశ్విన్ ఒక్కడినే తీసుకుంది.

దక్షిణాఫ్రికా జట్టు: డీన్ ఎల్గర్, ఐడెన్ మార్క్రామ్, టోనీ జార్జి, టెంబా బావుమా (కెప్టెన్), కీగన్ పీటర్సన్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెరైన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ, కగిసో రబాడ, ఆండ్రీ బర్గర్

భారత్ జట్టు: టీమిండియా పేస్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసాద్ కృష్ణ

Also Read: Scooter Condition Tips: చలికాలంలో మీ స్కూటర్ రిపేర్ కాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే?

Exit mobile version