IND vs PAK: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15 (ఆదివారం) శ్రీలంకలోని కొలంబోలో భారత్- పాకిస్థాన్ మధ్య మహా పోరు జరగనుంది. ఎన్నో ఇబ్బందుల తర్వాత పాకిస్థాన్ ఈ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించగా ఇప్పుడు ఈ మ్యాచ్‌పై వర్షం ముప్పు పొంచి ఉంది. శ్రీలంక అధికారులు ఫిబ్రవరి 15, 16 తేదీలకు వాతావరణ హెచ్చరికలు జారీ చేయడం క్రికెట్ అభిమానుల గుండెల్ని పిండేస్తోంది.
అక్యూవెదర్ నివేదిక ప్రకారం.. మ్యాచ్ రోజున సుమారు 4 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉంది. కేవలం వర్షమే కాకుండా, 26% మేర ఉరుములతో కూడిన తుఫాను వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. భారత్-పాక్ సమరం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిజంగా నిరాశ కలిగించే వార్తే.
Also Read: లివర్ క్యాన్సర్‌పై ఢిల్లీ వైద్యుల విజయం.. సర్జరీ లేకుండానే వృద్ధుడికి పునర్జన్మ!
75% chance of the rain on the 15th February, Pak-Ind match day. pic.twitter.com/Mk0CI71DVA
— Muhammad Haseeb (@mhkh123) February 13, 2026
తొలుత నిరాకరించిన పాకిస్థాన్
వాస్తవానికి భారత్‌తో తలపడటానికి పాకిస్థాన్ ప్రభుత్వం మొదట నిరాకరించింది. తమ జట్టు టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొంటుందని, కానీ భారత్‌తో జరిగే మ్యాచ్‌లో మాత్రం మైదానంలోకి దిగదని పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
పాకిస్థాన్ నిరాకరణతో క్రికెట్ ప్రపంచంలో కలకలం రేగింది. వెంటనే రంగంలోకి దిగిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)తో పలు సమావేశాలు నిర్వహించి సమస్యను పరిష్కరించింది. చివరికి పాకిస్థాన్ ఈ మ్యాచ్ ఆడేందుకు పచ్చజెండా ఊపింది. బంగ్లాదేశ్‌కు సంఘీభావం తెలుపుతూ పాకిస్థాన్ ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని భావించినట్లు తెలుస్తోంది. ఐసీసీ, పీసీబీ మధ్య జరిగిన ఈ చర్చల్లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా పాల్గొంది.
టీ20 వరల్డ్ కప్‌లో భారత్-పాక్ హెడ్-టు-హెడ్
టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్ vs పాకిస్థాన్ రికార్డులను పరిశీలిస్తే ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య మొత్తం 8 మ్యాచ్‌లు జరిగాయి.
- భారత్ విజయం: 7 సార్లు
- పాకిస్థాన్ విజయం: 1 సారి
పాకిస్థాన్‌కు దక్కిన ఏకైక విజయం 2021 టీ20 ప్రపంచకప్‌లో లభించింది. ఈ రికార్డులను బట్టి చూస్తే ఈసారి కూడా టీమ్ ఇండియాదే పైచేయిగా కనిపిస్తోంది.
