Rohit Sharma: టీమిండియా అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. పాక్‌తో మ్యాచ్‌కు రోహిత్ సిద్ధం..!

  • Written By:
  • Updated On - June 8, 2024 / 11:54 PM IST

Rohit Sharma: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం జూన్ 9న పాకిస్థాన్‌తో హైప్రొఫైల్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా సిద్ధమైంది. ఈ మ్యాచ్ న్యూయార్క్‌లోని నసావు క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma)కు పిచ్ షాకిచ్చింది. పిచ్‌పై అసాధారణ బౌన్స్ కారణంగా రోహిత్ గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తుండగా రోహిత్ మళ్లీ గాయపడ్డాడని కూడా వెలుగులోకి వచ్చింది. అలాగే స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ కూడా గాయపడ్డాడు. అయితే శనివారం జరిగిన ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడు.

ఐర్లాండ్‌తో జరిగిన టి-20 ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో గాయపడటంపై రోహిత్ మాట్లాడుతూ.. క్లిష్ట సమయాల్లో కూడా మేము విజయం సాధిస్తాం. గాయాలు లేదా షాక్‌లు రెండవ స్థానంలో ఉన్నాయి. ముందుగా జట్టుకు సహకారం ముఖ్యం. పిచ్ గురించి రోహిత్ మాట్లాడుతూ.. మేము ఎదుర్కోబోయే పిచ్ అంతర్జాతీయ సవాళ్లలో భాగమే. గబ్బాలో కూడా ఇలాంటి పిచ్‌నే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో మాకు చాలా గాయాలయ్యాయి. కానీ మాకు ప్రపంచకప్ కంటే పెద్దది ఏమీ ఉండదని చెప్పాడు.

Also Read: India vs Pakistan Tickets: భార‌త్‌- పాక్ మ్యాచ్ ఆ ఒక్క టికెట్ ధ‌ర రూ. 8.35 ల‌క్ష‌ల‌ట‌..!

పాకిస్థాన్‌ను తక్కువ అంచనా వేయలేం

పాకిస్తాన్‌పై ఒత్తిడి గురించి రోహిత్ మాట్లాడుతూ.. గత ప్రపంచ కప్‌లో జింబాబ్వే చేతిలో నిరాశ చెందారు. కానీ ఫైనల్‌కు చేరుకున్నారు. ఇటువంటి పరిస్థితిలో మేము వారిని తేలికగా తీసుకోవడం లేదు. ఏ జట్టు ఏ జట్టునైనా ఓడించగలదు. అందుకే మేము ఏ జ‌ట్టుని త‌క్కువ అంచ‌నా వేయ‌టంలేద‌ని తెలిపాడు రోహిత్ శ‌ర్మ‌.

We’re now on WhatsApp : Click to Join

క్యూరేటర్ కూడా అయోమయంలో ఉన్నాడు

న్యూయార్క్ పిచ్‌లపై రోహిత్ మాట్లాడుతూ.. ఈ వికెట్లు సవాలుతో కూడుకున్నవి. పిచ్ ఎలా ప్రవర్తిస్తుందో తెలియక క్యూరేటర్లు కూడా అయోమయంలో పడ్డారు. టీమ్ ఇండియా 8 మంది బ్యాట్స్‌మెన్‌తో ఎందుకు ఆడుతోంది? ఈ ప్రశ్నకు రోహిత్ స్పందిస్తూ.. దీనికి కారణం ఉంది. రిషబ్ పంత్ మూడో స్థానంలో ఎందుకు బ్యాటింగ్ చేస్తున్నాడు? ఈ ప్రశ్నకు సమాధానంగా.. అతను ఐపీఎల్‌లో మొదటి కొన్ని మ్యాచ్‌లు పంత్‌ని చూశాను. అప్పుడే ఆ నిర్ణయం తీసుకున్నాను. పంత్ ఎదురుదాడి నైపుణ్యం జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుంది. మేము యశస్వికి జ‌ట్టుకో స్థానం ఇవ్వలేకపోవడానికి ఇదే కారణమ‌ని చెప్పాడు. అయితే రేపు జ‌రిగే మ్యాచ్‌లో తాను అందుబాటులో ఉంటున్న‌ట్లు తెలిపాడు.