Ind vs Pak Live: 2019 ప్రపంచకప్ తర్వాత అంటే 4 సంవత్సరాల తర్వాత ఇరు జట్లు తొలిసారి తలపడనుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. విరాట్ కోహ్లి మరో 102 పరుగులు చేస్తే, వన్డేల్లో అత్యంత వేగంగా 13 వేల పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొడతాడు. గాయం నుంచి కోలుకున్న శ్రేయాస్ అయ్యర్, యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ లు బరిలోకి దిగే అవకాశం ఉంది. బౌలింగ్‌లో గాయం నుంచి కోలుకున్న జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి వచ్చాడు. మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఆల్ రౌండర్ జడేజా, హార్దిక్ పాండ్యా భారత జట్టుకు బలం చేకూర్చారు
పాకిస్థాన్ జట్టులో బాబర్ ఆజం ఇమామ్ ఉల్-హక్ మరియు బహర్ జమాన్ నిలకడగా రాణిస్తున్నారు. బౌలింగ్‌లో షకీన్ షా ఆఫ్రిది, నసీమ్ షా మరియు హారిస్ రౌబ్ అత్యుత్తమ ఫాస్ట్ బౌలింగ్ లైనప్ ఉంది. కాబట్టి ఇది భారత బ్యాటింగ్‌కు, పాకిస్థాన్ బౌలింగ్‌కు మధ్య జరిగే పోరుగా అభివర్ణిస్తారు విశ్లేషకులు.
ఆసియా కప్ ఆరంభ మ్యాచ్ లో పాక్ ని చిత్తు చేసి బోణి కొట్టాలని టీమిండియా ఊవిళ్లూరుతోంది. ఎప్పుడూ బలంగా ఉండే పాకిస్థాన్ బౌలింగ్ ఈ సారి మరింత ప్రమాదకరంగా కనిపిస్తుంది. షాహిన్ ఆఫ్రిదితో టీమిండియా జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. భారత్ బ్యాటింగ్ లో బలంగా కనిపిస్తుంటే.. పాకిస్తాన్ బౌలింగ్ లో స్ట్రాంగ్ గా ఉంది. నేపాల్ తో జరిగిన పోరులో సెంచరీలతో మెరిసిన బాబర్ ఆజమ్, ఇఫ్తికర్ అహ్మద్ లు భారత్ తో జరిగే మ్యాచ్ లో కూడా రెచ్చిపోవాలని ఉన్నారు.ఇటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు జట్టుకు మరోసారి కీలకం కానున్నారు.
Also Read: Salaar Postponed: డిసెంబర్ లో సలార్.. జవాన్ అడ్వాన్స్ బుకింగ్ చూసి సలార్ మేకర్స్ షాక్!