Site icon HashtagU Telugu

Hanuman Chalisa: హనుమాన్ చాలీసా విని గ్రౌండ్‌లోకి అడుగుపెట్టే టీమిండియా ఆట‌గాడు ఎవ‌రంటే?

IND vs PAK

IND vs PAK

Hanuman Chalisa: సెప్టెంబర్ 14న జరగబోయే ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. టీమిండియా ఆటగాళ్లంతా పాకిస్థాన్‌పై ఆధిపత్యం చెలాయించాలని ఉవ్విళ్లూరుతున్నారు. అయితే హార్దిక్ పాండ్యాకు పాకిస్తాన్ భయపడుతుంది. ప్రతిసారీ పెద్ద మ్యాచ్‌లలో హార్దిక్ అద్భుతమైన ప్రదర్శన ఇస్తుంటాడు. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో కూడా తమ స్టార్ ఆల్‌రౌండర్ అద్భుతమైన ప్రదర్శన ఇస్తాడని టీమిండియా ఆశగా ఎదురుచూస్తోంది. ఆదివారం సాయంత్రం హార్దిక్ పాండ్యా ‘హనుమాన్ చాలీసా’ (Hanuman Chalisa) చదివి దుబాయ్‌లో పాకిస్థాన్‌ను బంతితో, బ్యాట్‌తో ఆధిప‌త్యం చెలాయించ‌టానికి సిద్ధమవుతున్నాడు.

పాక్‌పై హార్దిక్ పాండ్యాకు మంచి

సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్ పాండ్యా ఒక పెద్ద విషయాన్ని వెల్లడించాడు. ప్రతి మ్యాచ్ ప్రారంభానికి ముందు ఏ పాట వింటారని అడగ్గా.. హనుమాన్ చాలీసా వింటూ మైదానంలోకి అడుగుపెడతానని హార్దిక్ చెప్పాడు. అంటే సెప్టెంబర్ 14న సాయంత్రం కూడా హార్దిక్ హనుమాన్ చాలీసా విని పాకిస్థాన్ బౌలింగ్ అటాక్‌తో ఆడుకుంటాడ‌ని అభిమానులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. హార్దిక్‌కు ఎల్లప్పుడూ పాకిస్తాన్ బౌలింగ్ అటాక్ అంటే ఇష్టం. ఒంటరిగా మ్యాచ్‌ను తిప్పికొట్టే సామర్థ్యం అతనికి ఉంది. బ్యాటింగ్ తో పాటు, గత కొంతకాలంగా బౌలింగ్‌లో కూడా హార్దిక్ అద్భుతమైన ప్రదర్శన ఇస్తున్నాడు.

Also Read: Engineering Colleges : సోమవారం నుంచి ఇంజినీరింగ్ కాలేజీలు బంద్?

అద్భుతమైన ఫాంలో హార్దిక్

హార్దిక్ పాండ్యా ప్రస్తుతం అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. గత 10 టీ20 ఇన్నింగ్స్‌లలో హార్దిక్ 250 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతడి స్ట్రైక్ రేట్ కూడా అద్భుతంగా ఉంది. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ హార్దిక్ అదరగొడుతున్నాడు. పాకిస్థాన్‌పై హార్దిక్ ముఖ్యంగా టీమిండియాకు అతిపెద్ద మ్యాచ్ విన్నర్‌గా నిరూపించుకున్నాడు. 2024 టీ20 ప్రపంచ కప్‌లో కూడా హార్దిక్ బ్యాట్‌తో, బంతితో అద్భుతంగా రాణించాడు. ఫైనల్ మ్యాచ్‌లో తన బౌలింగ్‌తో మ్యాచ్‌ను పూర్తిగా మార్చేశాడు.