Site icon HashtagU Telugu

Asia Cup Final: ఆసియా కప్ 2025 ఫైనల్‌.. దుబాయ్‌లో కట్టుదిట్టమైన భద్రత!

Asia Cup Final

Asia Cup Final

Asia Cup Final: నేడు ఆసియా కప్ ఫైనల్ (Asia Cup Final) జరగనుంది. దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య ఈ టైటిల్ మ్యాచ్ జరగనుంది. ఆసియా కప్ 41 సంవత్సరాల చరిత్రలో మొదటిసారిగా భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఈ టైటిల్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మహాపోరు సందర్భంగా దుబాయ్ ఈవెంట్స్ సెక్యూరిటీ కమిటీ చాలా కఠినమైన నియమాలను రూపొందించింది. అలాగే దుబాయ్ పోలీసులు కూడా కట్టుదిట్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు.

భద్రతా సంస్థలు ఈ మ్యాచ్‌ను ఎలాంటి అంతరాయం లేకుండా పటిష్టమైన భద్రత మధ్య నిర్వహించాలని పట్టుదలతో ఉన్నాయి. కొన్ని నెలల క్రితం జమ్మూకశ్మీర్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులు 26 మంది అమాయక భారతీయులను హత్య చేయడంతో భారత్ ‘ఆపరేషన్ సింధూర్’ ద్వారా ప్రతీకార దాడులు చేసింది. ఈ నేపథ్యంలో భద్రతా సంస్థలు భారత్-పాక్ ఫైనల్‌ కోసం ఈ కఠిన నిబంధనలను రూపొందించాయి.

Also Read: BCCI: బీసీసీఐలో కీలక మార్పులు.. కొత్త అధ్య‌క్షుడు, సెలెక్ట‌ర్లు వీరే!

స్టేడియంలో నిషేధించిన వస్తువులు

వీక్షకులకు మార్గదర్శకాలు

భారత్-పాక్ ఫైనల్‌కు సంబంధించిన ఈ నిబంధనలు, మార్గదర్శకాలు కేవలం దుబాయ్‌కి మాత్రమే వర్తిస్తాయి. భారత్‌లో నియమాల ప్రకారం భారత జట్టు విజయం సాధిస్తే సంబరాలు చేసుకోవచ్చు. నేటి భారత్-పాకిస్తాన్ ఫైనల్‌లో ఆటగాళ్ల ఉత్సాహం తారాస్థాయిలో ఉంటుంది. అంతకుముందు లీగ్ దశలో, ఆ తర్వాత సూపర్-4లో భారత జట్టు పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. నేడు టీమ్ ఇండియా 9వ సారి ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.

Exit mobile version