IND vs NZ: న్యూజిలాండ్‌తో తలపడేందుకు టీమ్ ఇండియా ఆటగాళ్లు సర్వం సిద్ధమయ్యారు. జట్టులోకి ఇద్దరు స్టార్ ప్లేయర్లు తిరిగి రావడంతో గత సిరీస్‌లో అద్భుతంగా రాణించిన కొందరు ఆటగాళ్లు ఈసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి వస్తోంది. ఈ సిరీస్‌లో కూడా జట్టు భారం ప్రధానంగా ఇద్దరు మాజీ కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భుజాలపైనే ఉండనుంది.
బెంచ్‌కే పరిమితం కానున్న సూపర్ స్టార్ ప్లేయర్
టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గత వన్డే సెంచరీ వీరుడు యశస్వి జైస్వాల్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది. గిల్ జట్టులోకి రావడంతో ఓపెనింగ్ స్థానంలో జైస్వాల్‌ను ఫిట్ చేయడం కష్టంగా మారింది. అదేవిధంగా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా వేచి చూడక తప్పదు. ఎందుకంటే కీపింగ్ బాధ్యతలను కేఎల్ రాహుల్ చేపట్టడం దాదాపు ఖాయం. పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి కూడా ప్రస్తుతం తుది జట్టులో చోటు దక్కడం కష్టంగానే కనిపిస్తోంది.
Also Read: ప్రీ బడ్జెట్ సమావేశం, నిర్మలమ్మ కు భట్టి విజ్ఞప్తులు
ప్రసిద్ధ్ కృష్ణకు తప్పని నిరీక్షణ
స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి రావడంతో ప్రసిద్ధ్ కృష్ణను ప్లేయింగ్ 11 నుండి తప్పించవచ్చు. యువ బౌలర్ హర్షిత్ రాణాకు ఇప్పటికే జట్టులో స్థానం ఖాయమైనట్లు కనిపిస్తోంది. అలాగే అర్ష్‌దీప్ సింగ్‌కు కూడా ప్రసిద్ధ్ కంటే ముందే ప్రాధాన్యత లభించనుంది. ఇక స్పిన్ విభాగంలో ముగ్గురు ఆటగాళ్లు ఉండటం ఖాయం. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆల్ రౌండర్ల మీద ఎక్కువ నమ్మకం ఉంచుతున్న నేపథ్యంలో జట్టు కూర్పు ఆసక్తికరంగా మారింది.
భారత జట్టు (తుది జట్టు అంచనా)
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
