Site icon HashtagU Telugu

Ind vs NZ: రోహిత్‌, కోహ్లీ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. న్యూజిలాండ్‌తో టీమిండియా వ‌న్డే షెడ్యూల్ ఇదే!

Ind vs NZ

Ind vs NZ

Ind vs NZ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) న్యూజిలాండ్ భారత (Ind vs NZ) పర్యటన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ సిరీస్ 2026 పురుషుల టీ20 వరల్డ్ కప్‌కు ముందు జరగనుంది. ఇందులో 3 వన్డేలు, 5 టీ20 మ్యాచ్‌లు ఆడ‌నున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఈ రెండు జట్లు ఈ సిరీస్‌లో తలపడనున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్, టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. అయినప్పటికీ వారిద్దరూ న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో ఆడతారు. న్యూజిలాండ్ పర్యటన జనవరి 11న వన్డే సిరీస్‌తో ప్రారంభమవుతుంది. చివరి మ్యాచ్ జనవరి 31న జరుగుతుంది. 2026 టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఈ సిరీస్ భారత్‌కు చాలా కీలకం. ఫిబ్రవరి-మార్చి 2026లో టీ20 వరల్డ్ కప్ భారత్, శ్రీలంకలో జరగనుంది.

15 ఏళ్ల తర్వాత ఈ మైదానంలో మ్యాచ్

వన్డే సిరీస్ మొదటి మ్యాచ్ గుజరాత్‌లోని వడోదరలో జరుగుతుంది. ఈ మైదానంలో 15 ఏళ్ల తర్వాత భారత పురుషుల జట్టు మ్యాచ్ ఆడనుంది. ఇటీవల భారత్- వెస్టిండీస్ మహిళల జట్ల మధ్య ఈ మైదానంలో సిరీస్ జరిగింది. భారత్ న్యూజిలాండ్‌తో 2010లో ఈ మైదానంలో మ్యాచ్ ఆడింది. అప్పుడు గౌతమ్ గంభీర్ శతకం సాధించగా, విరాట్ కోహ్లీ నాటౌట్ 63 పరుగులు చేశారు.

Also Read: VVS Laxman: గంభీర్ స్థానంలో వీవీఎస్ ల‌క్ష్మ‌ణ్‌.. టీమిండియాలో కీలక మార్పు!

భారత్- న్యూజిలాండ్ సిరీస్ పూర్తి షెడ్యూల్

BCCI న్యూజిలాండ్‌తో భారత్ ఆడబోయే పరిమిత ఓవర్ల సిరీస్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ సిరీస్ 2026 ప్రారంభంలో జరుగుతుంది. వడోదర, రాజ్‌కోట్, ఇండోర్‌లో వన్డే మ్యాచ్‌లు జనవరి 11, 14, 18 తేదీలలో జరుగుతాయి. అలాగే జనవరి 21 నుంచి 31 వరకు ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడ‌నున్నారు. మొదటి మ్యాచ్ నాగ్‌పూర్‌లో (జనవరి 21), రెండవ మ్యాచ్ రాయ్‌పూర్‌లో (జనవరి 23), మూడవ మ్యాచ్ గౌహతిలో (జనవరి 25), నాల్గవ మ్యాచ్ విశాఖపట్నంలో (జనవరి 28), ఐదవ టీ20 తిరువనంతపురంలో (జనవరి 31) జరుగుతాయి.