IND vs NZ: మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రస్తుతం 1-1తో సమానంగా ఉంది. సిరీస్ విజేతను నిర్ణయించే మూడవ, చివరి పోరు ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ను గెలుచుకునే సువర్ణావకాశం న్యూజిలాండ్ ముందుంది. రాజ్‌కోట్‌లో జరిగిన రెండో వన్డేలో కివీస్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అంతేకాకుండా మొదటి మ్యాచ్‌లో కూడా ఆ జట్టు గట్టి పోరాటమే ఇచ్చింది. అయినప్పటికీ భారత్‌లో వన్డే సిరీస్ గెలవాలన్న కివీస్ కల కలగానే మిగిలిపోనుంది. శుభ్‌మన్ గిల్ సేన న్యూజిలాండ్ ఆశలను నెరవేరనివ్వదు.
ఇండోర్‌లో విజయం మర్చిపో న్యూజిలాండ్
నిజానికి ఇండోర్‌లో టీమ్ ఇండియా వన్డే రికార్డు అద్భుతంగా ఉంది. ఈ మైదానంలో భారత జట్టు ఇప్పటి వరకు మొత్తం 7 వన్డే మ్యాచ్‌లు ఆడింది. అన్నింటిలోనూ విజయం రుచి చూసింది. అంటే హోల్కర్ స్టేడియంలో ఆడుతున్నప్పుడు ఓటమి అంటే ఎలా ఉంటుందో టీమ్ ఇండియాకు అసలు తెలియదు.
Also Read: రోగనిరోధక శక్తి పెరగాలంటే రోజూ ఇలా చేయాల్సిందే!
ఇప్పుడు శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు తన ఈ అజేయమైన రికార్డును కొనసాగించాలనే ఉద్దేశంతో బరిలోకి దిగనుంది. అదే సమయంలో న్యూజిలాండ్ తొలిసారిగా భారత గడ్డపై వన్డే సిరీస్‌ను గెలవాలంటే వారు తమ అత్యుత్తమ ఆటతో ఇండోర్ చరిత్రను తిరగరాయాల్సి ఉంటుంది.
పిచ్ ఎలా ఉంటుంది?
సిరీస్‌లోని మూడవ వన్డే మ్యాచ్ ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ఇండోర్‌లోని ఈ గ్రౌండ్‌ను బ్యాటర్ల స్వర్గధామంగా భావిస్తారు. పిచ్‌పై మంచి బౌన్స్ ఉండటం వల్ల బంతి బ్యాట్‌పైకి సులభంగా వస్తుంది. ఈ మైదానం బౌండరీలు కూడా చిన్నవిగా ఉండటం వల్ల ఇక్కడ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురుస్తుంది. అంటే భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగే మూడవ వన్డేలో కూడా పరుగుల వరద పారే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పరుగులను నియంత్రించడం బౌలర్లకు చాలా కష్టమైన పని.
