తొలి టీ20లో టీమిండియా ఘ‌న‌విజ‌యం!

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఆరంభంలోనే చుక్కెదురైంది. ఓపెనర్ డెవాన్ కాన్వే 2 బంతులు ఆడి సున్నా పరుగులకే అవుట్ కాగా, టిమ్ రాబిన్సన్ 15 బంతుల్లో 21 పరుగులు చేశాడు.

Published By: HashtagU Telugu Desk
IND vs NZ

IND vs NZ

IND vs NZ: భారత్- న్యూజిలాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టీ-20 సిరీస్ ప్రారంభమైంది. ఈ సిరీస్‌లో భాగంగా జనవరి 21న నాగ్‌పూర్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్ ఇండియా ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు భారీ స్కోరును నమోదు చేసింది. అభిషేక్ శర్మ తుఫాన్ అర్ధసెంచరీతో చెలరేగగా హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ తమదైన శైలిలో రాణించారు. ఈ విజయంతో భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది.

అభిషేక్, రింకూల మెరుపు ఇన్నింగ్స్

ఓపెనర్‌గా వచ్చిన సంజూ శాంసన్ జట్టుకు ఆశించిన స్థాయిలో ఆరంభాన్ని ఇవ్వలేకపోయాడు. అతను 7 బంతుల్లో కేవలం 10 పరుగులు చేసి అవుటయ్యాడు. అయితే మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం 35 బంతుల్లోనే 84 పరుగులు చేసి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు ఉన్నాయి.

అనంతరం సూర్యకుమార్ యాదవ్ 22 బంతుల్లో 32 పరుగులు, హార్దిక్ పాండ్యా 16 బంతుల్లో 25 పరుగులు చేశారు. చివర్లో రింకూ సింగ్ 20 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరి ధాటికి భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 238/7 పరుగుల భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ 2 వికెట్లు తీయగా, కైల్ జెమీసన్ 4 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

Also Read: 77వ గణతంత్ర దినోత్సవ వేడుక‌లు.. నేరస్తులను గుర్తించేందుకు స్మార్ట్ గ్లాసెస్?!

న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎలా సాగిందంటే..

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు ఆరంభంలోనే చుక్కెదురైంది. ఓపెనర్ డెవాన్ కాన్వే 2 బంతులు ఆడి సున్నా పరుగులకే అవుట్ కాగా, టిమ్ రాబిన్సన్ 15 బంతుల్లో 21 పరుగులు చేశాడు. నాలుగో నంబర్‌లో వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ అద్భుత పోరాటం చేశాడు. అతను 40 బంతుల్లో 78 పరుగులు చేసి దూకుడుగా ఆడాడు. అయితే, అతను అవుటైన తర్వాత కివీస్ వేగం తగ్గింది. మార్క్ చాప్‌మన్ 24 బంతుల్లో 39 పరుగులు చేసినా ప్రయోజనం లేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది.

  Last Updated: 21 Jan 2026, 11:04 PM IST