IND vs NZ 3rd T20: వర్షంతో మూడో టీ20 టై.. సిరీస్ గెలుచుకున్న టీమిండియా!

వర్షంతో మూడో టీ20 టై.. సిరీస్ గెలుచుకున్న టీమిండియా

  • Written By:
  • Updated On - November 22, 2022 / 05:37 PM IST

న్యూజిలాండ్ లో పర్యటిస్తున్న యువ టీమిండియా మెరుగైన ప్రదర్శన ఇస్తోంది. వర్షం కారణంగా మొదటి టీ20 రద్దు కాగా, రెండు మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో టిమిండియా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సూర్య కుమార్ యాదవ్ సూపర్ సెంచరీ సాధించడంతో టీమిండియా భారీ విజయం సాధించింది. తాజాగా మూడో టీ20లో భారత్ మెరుగైన ప్రదర్శన చేసింది. అయితే వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో చివరి టీ20 టైగా ముగిసింది. దీంతో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌ను భారత్ 1-0తో కైవసం చేసుకుంది.

ఆతిథ్య జట్టు బ్యాటింగ్ చేయాలని భావించడంతో న్యూజిలాండ్‌ను 160 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా 18 బంతుల్లో 30 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే వర్షం కారణంగా ఆట ఆగిపోయే సమయానికి భారత్ 9 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌ను తిరిగి ప్రారంభించలేకపోయారు.

వర్షం ఆటను నిలిపివేసినప్పుడు భారత్ DLS స్కోరుతో సమానంగా ఉంది. అందువల్ల మ్యాచ్ టైగా ప్రకటించింది. న్యూజిలాండ్ నుంచి డెవాన్ కాన్వే (59), గ్లెన్ ఫిలిప్స్ (54) అర్ధశతకాలు సాధించారు. పవర్‌ప్లే ఓవర్లలో ఫిన్ అలెన్ (3), మార్క్ చాప్‌మన్ (12) నిష్క్రమించిన తర్వాత ఇద్దరూ 86 పరుగుల భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నారు. కానీ భారత బౌలర్లు బాగా రాణించడంతో బ్యాటింగ్ కుప్పకూలడంతో న్యూజిలాండ్ 19.4 ఓవర్లలో ఆలౌట్ అయింది. మహ్మద్ సిరాజ్ (4/17), అర్ష్‌దీప్ సింగ్ (4/37) చెరో నాలుగు వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నారు.