Site icon HashtagU Telugu

Pitch Report: పూణె పిచ్ రిపోర్ట్‌ ఇదే.. టాస్ కీల‌కం కానుందా?

Pitch Report

Pitch Report

Pitch Report: బెంగళూరు టెస్టులో ఓటమి తర్వాత న్యూజిలాండ్‌ను పుణెలో దెబ్బ‌కు దెబ్బ తీసేందుకు సిద్ధమైంది టీమిండియా. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో (Pitch Report) భారత బ్యాట్స్‌మెన్‌ల ప్రదర్శన అవమానకరంగా ఉన్నప్పటికీ.. రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ పుంజుకున్నారు. 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై న్యూజిలాండ్ టెస్టు విజయాన్ని చవిచూసింది. సిరీస్‌లో రెండో మ్యాచ్‌ పుణెలో జరగనుంది. శుభమాన్ గిల్ ఫిట్‌గా ఉన్నాడు. గిల్ పునరాగమనం టీమ్ ఇండియాకు రిలీఫ్ న్యూస్. మరోవైపు కివీస్ జట్టు 92 ఏళ్ల చరిత్రను తిరగరాయాలని చూస్తోంది. టెస్టు సిరీస్ గెలవాలనే ఉద్దేశంతో న్యూజిలాండ్ భారత గడ్డపై తొలిసారిగా రంగంలోకి దిగింది.

పుణె పిచ్ ఎలా ఉంది?

పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. పుణెలో బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చెలరేగడంతో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసే అవ‌కాశం ఉంది. ఇప్పటి వరకు ఈ మైదానంలో మొత్తం రెండు టెస్టు మ్యాచ్‌లు జరగ్గా, రెండు మ్యాచ్‌ల్లోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు విజయం సాధించింది. 2019లో దక్షిణాఫ్రికాతో ఆడిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో స్కోరు బోర్డులో 601 పరుగులు చేసింది. అంటే పూణెలో టాస్ కీలక పాత్ర పోషిస్తుంది. బ్యాట్స్‌మెన్‌తో పాటు స్పిన్ బౌలర్లకు కూడా పిచ్ ఎంతో సహకరిస్తుంది. టెస్టులో నాలుగో, ఐదో రోజుల్లో స్పిన్నర్ల బంతులు ఎక్కువగా తిరుగుతాయి.

Also Read: Indian Players: ఈ ముగ్గురు ఆటగాళ్ల‌పైనే టీమిండియా ఆశ‌లు.. లిస్ట్‌లో ఇద్ద‌రూ ఆల్ రౌండ‌ర్లు!

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

పూణెలోని ఈ మైదానంలో 2017లో భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. అదే సమయంలో 2019లో జట్టు దక్షిణాఫ్రికాను ఇన్నింగ్స్, 37పరుగుల తేడాతో ఓడించింది. ఈ మైదానంలో తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 430. రెండో ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 190, మూడో ఇన్నింగ్స్‌లో 237, నాలుగో ఇన్నింగ్స్‌లో 107. అంటే నాలుగో ఇన్నింగ్స్‌లో ఈ మైదానంలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.