IND vs ENG 4th Test: నాలుగో టెస్టుకు జట్టుని ప్రకటించిన బీసీసీఐ

టీమిండియా 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 2-1 ఆధిక్యం సాధించింది. ఫిబ్రవరి 23న రాంచీ వేదికగా నాలుగవ టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టుని బీసీసీఐ ప్రకటించింది.

IND vs ENG 4th Test: ఇంగ్లండ్‌తో జరగనున్న నాలుగో టెస్టుకు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా జట్టు నుంచి విముక్తి పొందాడు. రాంచీ టెస్టుకు ముందు బుమ్రా విడుదలైనట్లు మరియు అతనితో పాటు కేఎల్ రాహుల్ గాయం కారణంగా నాల్గవ టెస్ట్ నుండి తప్పుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. అదే సమయంలో మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు నుండి వైదొలిగిన ముఖేష్ కుమార్ రాంచీ టెస్టు ద్వారా జట్టుతో జత కట్టనున్నాడు.

సొంతగడ్డపై జరుగుతున్న ఈ కీలక సిరీస్ లో టీమిండియా అదరగొడుతుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత ఆటగాళ్లు వైఫల్యం చెందినప్పటికీ ఆ తర్వాత రెండు మూడు టెస్ట్ మ్యాచుల్లో సత్తా చాటారు. ముఖ్యంగా ముంబై కుర్రాడు యశస్వి జైస్వాల్ రెండు డబుల్ సెంచరీలతో ఊచకోత కోశాడు.అంతేకాకుండా గిల్, రోహిత్ శర్మ, జడేజా బ్యాటింగ్ పరంగా ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. మరోవైపు టీమిండియాలో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతూ సెలెక్టర్లను మైమరిపించాడు. తొలి టెస్టు ఇన్నింగ్స్ లో 62 పరుగులతో చాటగా , ఆ తర్వాత ఇన్నింగ్స్ లో 68 పరుగులతో సత్తా చాటాడు. మొత్తానికి టీమిండియా 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 2-1 ఆధిక్యం సాధించింది. ఫిబ్రవరి 23న రాంచీ వేదికగా నాలుగవ టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత జట్టుని బీసీసీఐ ప్రకటించింది.

టీమిండియా జట్టు ఇదే..
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌, రజత్‌ పాటిదార్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్‌), కేఎస్‌ భరత్‌ (వికెట్‌ కీపర్‌), దేవ్‌దత్‌ పడిక్కల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, ఆకాశ్‌ దీప్‌.

Also Read: Priyamani : బాలీవుడ్ భామల గుట్టు విప్పిన అమ్మడు.. డబ్బులిచ్చి మరీ అలా చేయించుకుంటారట..!