Ball Tampering: మాంచెస్టర్‌లో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో నాల్గవ రోజు ఆట పూర్తయింది. ఐదవ రోజు ఆట ప్రారంభం కాబోతోంది. మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే టీమిండియాకు గెలిచే అవకాశం లేదు.
బ్రైడన్ కార్స్ బాల్ టాంపరింగ్ చేశాడా?
నాల్గవ రోజు బ్రైడన్ కార్స్ బౌలింగ్ చేస్తున్న 12వ ఓవర్‌లో ఈ సంఘటన జరిగింది. శుభ్‌మన్ గిల్ కార్స్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత ఫాలో-త్రూలో కార్స్ బంతిని తన కాలితో ఆపి, తన బూట్ల స్పైక్స్‌తో బంతిపై పెద్ద గుర్తులు చేయడం కెమెరాలో స్పష్టంగా కనిపించింది. ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ కూడా దీనిని గమనించి స్కై స్పోర్ట్స్‌లో వ్యాఖ్యానిస్తూ.. “బ్రైడన్ కార్స్ ఆ ఆఖరి ఓవర్‌లో,ఫాలో-త్రూలో ఇలా చేస్తాడు. బంతిని ఆపి… ఓహో! బంతిపై బూట్ల స్పైక్స్‌తో కొన్ని పెద్ద గుర్తులను చేస్తాడు” అని వ్యాఖ్యానించారు.
Also Read: CM Chandrababu : సింగపూర్ లో తొలి రోజు బిజీబిజీగా సీఎం చంద్రబాబు..
English team is Ball Tampering?#INDvsENG #BallTampering pic.twitter.com/Pb020N6AWe
— Forever_Kafir (@Ravi_s33) July 26, 2025
ఈ చర్య బాల్ టాంపరింగ్ (Ball Tampering) వివాదానికి దారితీసింది. బంతిని కృత్రిమంగా మార్చడానికి ప్రయత్నించడం బాల్ టాంపరింగ్ అవుతుంది. ఇది క్రికెట్ నియమాలకు విరుద్ధం. కార్స్ ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదా అనేది స్పష్టంగా తెలియకపోయినా అతని చర్య బంతి స్థితిని మార్చగల అవకాశం ఉంది. దీనిపై మ్యాచ్ రిఫరీ లేదా ఐసీసీ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
టీమిండియా నాల్గవ రోజు ఆటతీరు
ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 669 పరుగుల వద్ద ముగించింది, ఇందులో జో రూట్ 150 పరుగులు, బెన్ స్టోక్స్ 141 పరుగులు చేశారు. టీమిండియా తరఫున రవీంద్ర జడేజా 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం టీమిండియా నాల్గవ రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ డకౌట్ అయ్యారు. ఆ తర్వాత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (78*), కేఎల్ రాహుల్ (87*) అద్భుతమైన బ్యాటింగ్‌తో 172 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరూ అర్ధసెంచరీలు సాధించి, టీమిండియాకు పటిష్టమైన పునాది వేశారు. ఐదవ రోజు ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్ సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను డ్రా చేయడానికి ప్రయత్నిస్తారు.