IND vs ENG: భారత్ vs ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ అంత ఈజీ కాదా?

అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా అసలు సిసలు సమరానికి సిద్దమైంది. జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. హైదరాబాద్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.

IND vs ENG: అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా అసలు సిసలు సమరానికి సిద్దమైంది. జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. హైదరాబాద్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌కు ఇరు జట్లు పూర్తి స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. స్టార్ ప్లేయర్లతో కూడిన భారత జట్టు బ్రిటీషర్లను చిత్తూ చేసేందుకు ఊవిళ్లూరుతోంది. ఈ సిరీస్‌ తొలి రెండు మ్యాచ్‌లకు16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు.

సౌతాఫ్రికా పర్యటన అనంతరం విశ్రాంతి తీసుకున్న రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్, కేఎల్ రాహుల్, మహమ్మద్ సిరాజ్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. వీళ్ళతో పాటు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ముఖేష్ కుమార్, కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ఆవేశ్ ఖాన్ తొలి టెస్టు జట్టులో ఉన్నారు. ఇంగ్లండ్ జట్టు చివరిసారిగా 2012-13 సంవత్సరంలో భారత్‌పై టెస్టు సిరీస్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ కు మరో అవకాశం ఇవ్వలేదు. అయితే ఈ సిరీస్ విషయంలో ఇంగ్లండ్ జట్టును ఏ మాత్రం తక్కువ అంచనా వేసేది లేదు. టెస్టుల్లో ఇంగ్లండ్ జట్టు ప్రత్యర్థులను చిత్తు చేస్తోంది. మెకల్లమ్ డైరెక్షన్ లో ఇంగ్లండ్ గత రెండేళ్లలో 18 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 13 మ్యాచులు నెగ్గింది. గతేడాది యాషెస్‌ సిరీస్‌లో జరిగిన ఒక మ్యాచ్‌ డ్రా అయింది.

భారత్ తో టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ జట్టులో అద్భుతమైన కాంబినేషన్ ని సెట్ చేశారు. నలుగురు ఫాస్ట్ బౌలర్లు, నలుగురు స్పిన్నర్లను జట్టులోకి తీసుకున్నారు. బ్యాటింగ్‌లో అనుభవజ్ఞులైన జో రూట్‌, ఒలీ పోప్‌, జాక్‌ క్రాలే, కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ పరుగుల వరద పారించగలరు. జేమ్స్ అండర్సన్ భారత్‌పై సత్తా చాటేందుకు తహతహలాడుతున్నాడు. బ్రెండన్ మెకల్లమ్ ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఆట పరిస్థితులు ఎలా ఉన్నా, ఇంగ్లండ్ తమ ఆట తీరును మార్చలేదు. కాకపోతే ప్రత్యర్థులపై బ్యాటింగ్ విషయంలో ఏ మాత్రం వెనుకడుగేయదు.దీంతో ఇంగ్లాండ్ విషయంలో రోహిత్ సేన జాగ్రత్తగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా భారత్ జట్టులో అశ్విన్, జడేజా స్పిన్నర్లుగా బరిలోకి దిగనుండగా.. జస్‌ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, మహమ్మద్ సిరాజ్‌లు పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. బ్యాటింగ్ యూనిట్‌లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనుండగా.. శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ మిడిలార్డర్‌లో ఆడతారు.

Also Read: Rashmika Mandanna : హీరోని చెంపదెబ్బ కొట్టి బోరున ఏడ్చేసిన హీరోయిన్..!