Site icon HashtagU Telugu

IND vs ENG 4th Test: గెలుపు దిశగా టీమిండియా… ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టిన స్పిన్నర్లు

Ind Vs Eng

Ind Vs Eng

IND vs ENG: రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియాను విజయం ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ మరో 152 పరుగులు చేస్తే మ్యాచ్ తో పాటు సీరీస్ ను సొంతం చేసుకుంటుంది. రోహిత్‌ శర్మ , యశస్వి జైస్వాల్‌ క్రీజ్‌లో ఉండగా.. భారత్‌ చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 145 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్‌.. తొలి ఇన్నింగ్స్‌ లీడ్‌ కలుపుకుని టీమిండియాకు 192 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అశ్విన్‌ , కుల్దీప్‌ ధాటికి ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ పేకమేడలా కూలింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో జాక్‌ క్రాలే ఒక్కడే అర్దసెంచరీతో రాణించాడు. మిగతా ఆటగాళ్లంతా దారుణంగా విఫలమయ్యారు. బెయిర్‌స్టో , ఫోక్స్‌ , డకెట్‌ , రూట్‌ మాత్రమే రెండంకెల స్కోర్లు చేసారు.

టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌటైంది. .మూడో రోజు లంచ్‌కు ముందు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ కు తెర పడింది. చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన వికెట్ కీపర్ జురెల్ తొలి సెంచరీకి 10 పరుగుల దూరంలో ఔటయ్యాడు. 7 వికెట్లకు 219 పరుగుల స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 88 పరుగులు జోడించి మిగిలిన మూడు వికెట్లు కోల్పోయింది.

కుల్దీప్, ధృవ్ జురెల్ 8వ వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ సమయంలోనే ధ్రువ్ జురెల్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ధృవ్ తన రెండో టెస్టులోనే హాఫ్ సెంచరీ చేశాడు.ఆ తర్వాత ఆకాశ్ దీప్ తో కలిసి 40 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 9 పరుగుల వద్ద ఆకాష్ ఔటయ్యాడు. షోయబ్ బషీర్ ఔట్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఘనతను సాధించాడు. చివరి వికెట్‌గా జురెల్ ఔటయ్యాడు.కాగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. ఈ క్రమంలో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌పై 46 పరుగుల ఆధిక్యం సాధించింది.

Also Read: Bounce Infinity E1+: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. ఈ-స్కూటర్‌ పై రూ. 24వేల వరకూ తగ్గింపు?