Site icon HashtagU Telugu

IND vs ENG 1st Test: నేడు భార‌త్‌, ఇంగ్లండ్ జ‌ట్ల మధ్య తొలి టెస్ట్‌.. హైద‌రాబాద్‌లో టీమిండియా రికార్డు ఎలా ఉందంటే..?

IND vs ENG

India Vs South Africa Proba

IND vs ENG 1st Test: భారత్, ఇంగ్లండ్ (IND vs ENG 1st Test) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈరోజు (గురువారం) హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఆరేళ్ల తర్వాత హైదరాబాద్‌లో అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ జరుగుతోంది. చివరిసారిగా 2018లో వెస్టిండీస్‌తో ఈ మైదానంలో టీమిండియా టెస్టు మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఆరేళ్ల తర్వాత ఈ మైదానంలో టీమిండియా టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు సిద్ధమైంది. ఈసారి టీమిండియా కమాండ్ రోహిత్ శర్మ చేతిలో ఉంది. ఇరుజ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ఉదయం 9.30 గంట‌ల నుండి ప్రారంభ‌మ‌వుతుంది. టాస్ 9 గంట‌ల‌కు వేయ‌నున్నారు.

పిచ్ ప‌రిస్థితేంటి..?

ఈ మ్యాచ్‌కు ముందు పిచ్‌పై సర్వత్రా చర్చ జరిగింది. ఇప్పుడు క్రికెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. హైదరాబాద్ పిచ్‌పై స్పిన్నర్లు మరింత ప్రయోజనం పొందనున్నారు. దీంతో ఇంగ్లండ్ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌లో ముగ్గురు స్పిన్నర్లను కూడా చేర్చుకుంది. అంతే కాకుండా ఫాస్ట్ బౌలర్లకు పిచ్ నుంచి కొంత సహకారం లభించే అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్‌లో వాతావరణం కూడా తేలిక‌గా ఉంది. వ‌ర్షం ముప్పు లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులు ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ని చూడబోతున్నారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇరు జట్లూ భావిస్తున్నాయి.

Also Read: Hyderabad: హైదరాబాద్ మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణం, ట్రాఫిక్ రద్దీకి చెక్

హైదరాబాద్‌లో టీమిండియా రికార్డు

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో టీమిండియా ఇప్పటి వరకు 5 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో టీమ్ ఇండియా 4 మ్యాచ్‌లు గెలిచింది. కాగా ఒక మ్యాచ్ అసంపూర్తిగా మిగిలిపోయింది. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు ఒక్క టెస్టు మ్యాచ్‌లోనూ టీమిండియా ఓడిపోలేదు. ఇప్పుడు రోహిత్ శర్మ సారథ్యంలోని టీమ్ ఇండియా మరోసారి ఈ రికార్డును నిలబెట్టుకోవాలనుకుంటోంది. హైదరాబాద్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు కేవలం 2 మ్యాచ్‌లు మాత్రమే గెలవగా, ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన జట్టు 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ మైదానంలో అత్యధిక స్కోరు కూడా టీమ్ ఇండియాదే. 2017లో బంగ్లాదేశ్‌పై టీమిండియా 687 పరుగులు చేసింది. ఈ గడ్డపై టీమ్ ఇండియా అద్భుతమైన రికార్డును నెలకొల్పడం వల్ల ఈ మ్యాచ్ లో టీం ఇండియా విజయం సాధిస్తుందని అంతా భారతభావిస్తున్నా.. భార‌త‌ జట్టు మాత్రం ఇంగ్లండ్ ను తేలిగ్గా తీసుకోదలుచుకోలేదు.