IND vs BAN Pitch Report: నేడు భారత్‌- బంగ్లాదేశ్‌ జట్ల మధ్య రసవత్తర పోరు.. పిచ్‌ రిపోర్ట్‌ ఇదే..!

  • Written By:
  • Updated On - June 22, 2024 / 09:02 AM IST

IND vs BAN Pitch Report: టీ20 వరల్డ్ కప్ 2024 సూపర్ 8 స్టేజ్‌లో విజయంతో బోణీ చేసిన టీం ఇండియా తన రెండో మ్యాచ్‌ని ఆంటిగ్వాలోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో శనివారం, జూన్ 22న ఆడనుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత జట్టు (IND vs BAN Pitch Report) తలపడనుంది. నజ్ముల్ హసన్ శాంటో సారథ్యంలోని బంగ్లా జట్టుకు సూపర్ 8లో శుభారంభం లభించలేదు.ఆస్ట్రేలియా చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌కు సెమీ ఫైనల్స్ కలను సజీవంగా ఉంచుకోవాలంటే ఎట్టిపరిస్థితుల్లోనూ విజయం తప్పనిసరి. భారత జట్టు మరో విజయంతో టాప్-4లో స్థానం దక్కించుకోవాలని చూస్తోంది. అంతకంటే ముందు పిచ్ ఎలా ఉందో తెలుసుకుందాం.

ఆంటిగ్వా పిచ్‌ రిపోర్ట్‌ ఇదే

సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో బంతికి, బ్యాట్‌కి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడి పిచ్ బ్యాట్స్‌మెన్, బౌలర్లకు సమానమైన సహాయాన్ని అందిస్తుంది. మొదట్లో పేసర్ల ఆధిపత్యం కనిపిస్తోంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు కూడా ఈ పిచ్‌ సాయం చేయొచ్చని గణంకాలు చెబుతున్నాయి. క్రీజులో ఎక్కువ సేపు ఉన్న తర్వాత బ్యాట్స్‌మెన్ భారీ ఇన్నింగ్స్‌లు ఆడగలరు. ఆంటిగ్వాలో హార్డ్ లెంగ్త్‌లతో బౌలింగ్ చేసే బౌలర్లు మరింత ప్రాణాంతకంగా మారవచ్చు.

Also Read: Dasoju: బీఆర్ఎస్ నేతలను చట్టవిరుద్ధంగా నిర్బంధించడం నేరం: దాసోజు

అయితే టీ20 ప్రపంచకప్ 2024లో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో భారత్ 62 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. జూన్ 1వ తేదీన న్యూయార్క్‌లోని నసావు కౌంటీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 182 పరుగులు చేసింది. అనంతరం బంగ్లాదేశ్‌ 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఈ వార్మప్‌ మ్యాచ్‌ లో 8 మంది బౌలర్లను ప్రయత్నించాడు.

We’re now on WhatsApp : Click to Join

ఇరు జట్ల ఆటగాళ్లు

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్.

బంగ్లాదేశ్: తాంజిద్ హసన్, లిటన్ కుమార్ దాస్, నజ్ముల్ హసన్ శాంటో, రిషాద్ హుస్సేన్, తౌహీద్ హృదయ్, షకీబ్ అల్ హసన్, మహ్మదుల్లా, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, తంజిమ్ హసన్ షకీబ్, ముస్తాఫిజుర్ రహ్మాన్, జాకర్ అలీ, తన్వీర్ ఇస్లాం, షోరీ ఇస్లాం, సౌమ్య సర్కార్‌.