Site icon HashtagU Telugu

IND vs BAN Match: నేడు బంగ్లాదేశ్ తో టీమిండియా ఢీ.. భారత్ విజయ పరంపర కొనసాగుతుందా..?

IND vs BAN Match

Compressjpeg.online 1280x720 Image 11zon

IND vs BAN Match: పూణె వేదికగా నేడు భారత్, బంగ్లాదేశ్ (IND vs BAN Match) మధ్య మ్యాచ్ జరగనుంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఇప్పటివరకు భారత ఆటగాళ్లకు మంచిదని నిరూపించబడింది. పూణెలో వన్డేల్లో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలు చేశారు. ఇప్పుడు మరోసారి ఈ ఆటగాళ్లు మైదానంలోకి రానున్నారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. భారత్, బంగ్లాదేశ్ మధ్య తొలిసారి ఇక్కడ వన్డే మ్యాచ్ జరగనుంది.

మహారాష్ట్ర స్టేడియంలో ఇప్పటి వరకు 7 మ్యాచ్‌లు ఆడిన టీమ్ ఇండియా 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 3 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. భారత్ తన చివరి మ్యాచ్‌ని 2021లో ఇంగ్లండ్‌తో ఆడింది. ఈ పోరులో టీమిండియా 7 పరుగుల తేడాతో ఓడింది. అంతకు ముందు ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది. పుణెలో న్యూజిలాండ్‌ను కూడా భారత్ ఓడించింది. అయితే ఇంగ్లండ్‌తో పాటు ఆస్ట్రేలియాపై కూడా ఓటమి చూసింది. అక్టోబర్ 2013లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ 72 పరుగుల తేడాతో ఓడిపోయింది.

Also Read: Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు షాక్ ఇచ్చిన పోలీసులు.. కారుపై 3 చలాన్లు

We’re now on WhatsApp. Click to Join.

ఓవరాల్ గా భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లను పరిశీలిస్తే.. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా జట్టుదే పైచేయి కనిపిస్తోంది. బంగ్లాదేశ్‌పై భారత్ ఇప్పటి వరకు 31 మ్యాచ్‌ల్లో గెలిచింది. 8 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. కొలంబో వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య చివరి వన్డే మ్యాచ్ జరిగింది. సెప్టెంబర్ 2023లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 265 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా టీమిండియా 259 పరుగులకే ఆలౌటైంది.

పూణెలో భారత ఆటగాళ్లకు మంచి రికార్డు ఉంది. విరాట్ కోహ్లీ ఇక్కడ రెండు వన్డే సెంచరీలు చేశాడు. కేఎల్ రాహుల్ సెంచరీ చేశాడు. ఇక కోహ్లి యావరేజ్ గురించి చెప్పాలంటే 64.00గా ఉంది. కేఎల్ రాహుల్ సగటు 61.66. హార్దిక్ పాండ్యా సగటు 42.50. రోహిత్ శర్మ సగటు 24.50గా ఉంది.