IND vs BAN Live Updates: సెప్టెంబరు 19 నుండి చెన్నై వేదికగా భారత్ మరియు బంగ్లాదేశ్(IND vs BAN) మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టు మ్యాచ్ కోసం బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే ఐదో నంబర్ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానంలో కేఎల్ రాహుల్ సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan) పోటీ పడుతున్నారు. అయితే ఈ స్థానంలో ఎవరిని బరిలోకి దించుతారో తెలుసుకునేముందు వారి గత రికార్డులను తెలుసుకోవాలి.
కేఎల్ రాహుల్(KL Rahul) 2014లో టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయగా, సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా సర్పరాజ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అనుభవం పరంగా ఇద్దరిలో కెఎల్‌దే పైచేయి. కేఎల్ రాహుల్ భారత్ తరఫున 50 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 34.08 సగటు మరియు 52.23 స్ట్రైక్ రేట్‌తో 2863 పరుగులు చేశాడు.ఇందులో 8 సెంచరీలు 14 అర్ధ సెంచరీలు నెలకొల్పాడు. అటు సర్ఫరాజ్ ఇప్పటివరకు 3 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారతదేశం తరపున టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. గత మూడు టెస్టు మ్యాచ్‌ల్లో తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. .మూడు మ్యాచ్ ల్లో సర్పరాజ్ 50 సగటుతో 200 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో ఇద్దరూ అద్భుతంగా రాణించారు. కేఎల్ దులీప్ ట్రోఫీలో ఫిఫ్టీ కొట్టాడు. సర్ఫరాజ్ మొదటి ఇన్నింగ్స్‌లో 9 పరుగులు రెండవ ఇన్నింగ్స్‌లో 46 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తాజాగా బీసీసీఐ ప్రకటించిన 16 మంది సభ్యుల్లో వీళ్లిద్దరికీ చోటు కల్పించింది. అయితే నివేదికలను బట్టి చూస్తే..రోహిత్ శర్మ కేఎల్ రాహుల్‌కు ప్రాధాన్యత ఇచ్చి ప్లేయింగ్ ఎలెవన్‌లో చేర్చి నంబర్-5 బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది .మరి నంబర్ 5 స్థానంలో ఇద్దరిలో ఎవరైతే బాగుంటుందో కామెంట్ చేయండి.
Also Read: Australia To Ban Children From Social Media: పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం, ఎక్కడో తెలుసా?